Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక‌ప్ప‌టి మిస్ ఇండియా నేడు ఇలా?

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (17:12 IST)
Meenakshi
ఒకప్పుడు అంద‌గ‌త్తెగా వెలుగువెలిగిన బాలీవుడ్ న‌టి మీనాక్షి శేషాద్రి. మెగాస్టార్ చిరంజీవితో 1992లో `ఆప‌ద్భాంద‌వుడు` సినిమాలో న‌టించింది. అంత‌కుముందే ఎన్‌.టి.ఆర్‌.తో బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌లో న‌టించింది. కానీ ఆమెకు అంత గుర్తింపు రాలేదు. 18 ఏళ్ళ‌కే మిస్ ఇండియాగా గెలుపొందిన ఆమె ఇప్పుడు ఎలా వుందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఆమె ఫొలో ఈమ‌ధ్య‌నే సోష‌ల్‌మీడియాలో పెట్టింది. సినిమా కెరీర్ బాగానే వున్న‌ప్పుడు 1995లో హరీష్ మైసూర్ అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడామెకు ఇద్ద‌రు పిల్ల‌లు. ప్ర‌స్తుతం టెక్సాస్‌లో వుంటుంది.
 
అయితే తాజా ఫొటోలో ఆమె ఫేస్ క‌ళ త‌ప్పింది. పేల‌వంగా వుంది. వ‌య‌స్సుమీద ప‌డిన ఛాయ‌లు స్ప‌స్టంగా క‌నిపిస్తున్నాయి. గ‌త మేనెల‌లో ఆమెకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. కొద్దిరోజులు ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీనితో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. దానికి కార‌ణం లేక‌పోలేదు. జాతీయ స్థాయిలోని ఓ ఛాన‌ల్ 80, 90 ద‌శ‌కంలోని నాయిక‌లు గురించి చెబుతూ నటి మీనాక్షి శేషాద్రి గురించి ఆమె చేసిన సినిమాల్లోని మొత్తం ఎపిసోడ్ను చూపించింది. దాంతో ఆమె అభిమానులు కంగారుప‌డ్డారు. ఇది తెలిసిన ఆమె తాను సజీవంగా ఉన్నట్లు ఆధారాలు ఇచ్చింది. అందులో భాగ‌మే ఈ స్టిల్‌. మీనాక్షిఎరుపు రంగు కుర్తా ధరించి ఉంది. ఆమెకు సంబంధించి లేటెస్ట్‌ ఫోటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు మీనాక్షి ఇలా అయ్యిందేంటి అని షాకవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

Amaravati : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.. ఏపీ సర్కారు

ఒకే రోజులో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆస్పత్రి.. తుళ్లూరులో ప్రారంభం

రూ.500 బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసిన ప్రేమికులు.. అందులో ఏముందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments