Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌ట‌న ప‌రంగానూ నన్ను మెరుగుప‌రుచుకునేలా చేసింది ఇదే : ప్రిషా సింగ్

డీవీ
మంగళవారం, 23 జులై 2024 (14:37 IST)
Prisha Singh
అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ ..  ‘‘నా ఫొటోల‌ను చూసి ఆడిష‌న్‌కు పిలిచారు. సెల‌క్ట్ అయ్యాను. అయితే పాత్ర‌లోని వేరియేష‌న్స్ చూసి నేను చేయ‌గ‌ల‌నా! అని కూడా ఆలోచించాను. బ‌డ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌నిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్‌ను గ‌మ‌నించాను. వారెలా న‌డుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇత‌రుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు వంటి విష‌యాల‌ను గ‌మ‌నించాను.
 
ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్‌గారు ఎయిర్ హోస్ట‌స్ పాత్ర చేయ‌టానికి నాకు కొన్ని రెఫరెన్స్‌ల‌నిచ్చారు. అవేంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. టాలీవుడ్ న‌టించ‌టం న‌టిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఇంకా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌టానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. 
 
వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ‌. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా దీనికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసింది. అడ‌వుల్లో వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన యాత్రికుల‌తో క‌లిసి స‌ఫారీల్లో వెళ్లి అక్క‌డి జంతువుల‌ను త‌న కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష‌. 
 
‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవ‌లం జంతువుల‌ను, చెట్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను కెమెరాల్లో బంధించ‌టం మాత్ర‌మే కాదు. వాటికి సంబంధించి స‌హ‌జ‌మైన భావోద్వేగాల‌ను బంధించ‌ట‌మే. అలాంటి విష‌యాల‌ను నా కెమెరాలో బంధించిన‌ప్పుడు సంతృప్తిని, మంచి అనుభ‌వాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. న‌ట‌న ప‌రంగానూ ఇది నన్ను మెరుగుప‌రుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా న‌టించ‌గ‌లుగుతున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments