Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్యామ్ సింగ రాయ్’ కోసం సీతారామశాస్త్రి రాసిన చివరి పాట ఇదే

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:04 IST)
Nani, Sai Pallavi
లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాట న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
శాస్త్రిగారి  అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాట రికార్డ్ చేయబడింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ రోజు సిరివెన్నెల చివ‌రి పాట‌ను విడుద‌ల‌చేశారు.
 
నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాట‌కుమిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయి ప‌ల్ల‌వి కేవ‌లం రాత్రుల‌లోనే క‌లుస్తారు. వారు క‌లిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి ప‌ల్ల‌వి. వారు సినిమా హాలు, ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్తుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య క్లాసిక్  కెమిస్ట్రీ ఈ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెలగారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు.
 
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.
 
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
 
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments