Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ లుక్ ఇదే

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:40 IST)
Kajal- Bhagwant Kesari
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ మూవీ 'భగవంత్ కేసరి' షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ప్రధాన తారాగణంపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
 
మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లను అందజేస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
 
ఈ రోజు చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ చీరలో హోమ్లీగా కనిపించారు. సైకాలజీ పుస్తకం చదువుతూ ఫోన్‌లో మాట్లాడుతూ, పెద్ద అద్దాలు ధరించింది చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది.
 
ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments