Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడికి వెళ్తే అత్యాచారం చేస్తారని చెప్పారు.. రాధికా ఆప్టే

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (18:54 IST)
సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై బాలీవుడ్ టాప్ హీరోయిన్ రాధికా ఆప్టే స్పందించింది. సినిమాల్లో నటించేందుకు తను ముంబైకి వెళ్లాలనుకున్నప్పుడు చాలామంది బాలీవుడ్ గురించి చెడుగానే చెప్పారని రాధికా ఆప్టే చెప్పింది. సినీ నేపథ్యం లేకున్నా..  తాను వుండే పుణే నుచి సినిమాల కోసం ముంబై వెళ్లాలని భావించానని.. అప్పుడు చాలామంది తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్తే తనపై అత్యాచారం చేస్తారని చెప్పినట్లు రాధికా ఆప్టే తెలిపారు. 
 
బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారు. సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదు. అసలు సమస్య ఎక్కడుందంటే.. మనం కేవలం బాలీవుడ్‌లో జరిగే అతి గురించే మాట్లాడుకుంటాం. కానీ మనమంతా మనుషులమేనని అర్థం చేసుకోవాలి. తాను అందరిలాంటి మనిషినే. అందరివి సాధారణ జీవితాలుగానే చూడాలని రాధికా చెప్పుకొచ్చింది. 
 
కాగా.. సినీ నేపథ్యం లేకున్నా.. వచ్చే అవకాశాల్లోనే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఆమె నటించిన 'రాత్‌ అకేలీ హై' చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments