Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారం జరిగింది.. చెప్పులిచ్చారు.. బట్టలడిగితే? (Video)

సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడు

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (18:48 IST)
సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రశ్నించారు. 
 
ప్రత్యూష తండ్రి లేదని.. తల్లి ఏమీ చేయలేదని.. తమ్ముడు చిన్నవాడని తలచి సిద్ధార్థ్ రెడ్డి ఇంత పనిచేశాడని ప్రత్యూష ఆరోపించారు. డబ్బు, అధికారం వుంది కదాని వాళ్లంత పనిచేశారని.. తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కుమారులు ప్రత్యూషను రేప్ చేసిన కేసులో వున్నారని.. వారంతా సరైన ఆధారాలు లేవని తప్పించుకుని తిరుగుతున్నారని.. అయితే దేవుడు వారినందరినీ శిక్షిస్తాడని, నా బిడ్డ ఉసురు, నా ఉసురు తప్పకుండా తగులుతుందని ప్రత్యూష తల్లి తెలిపారు. 
 
ప్రత్యూషను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని.. ప్రత్యూష చెప్పులు, ఉంగరం, చెైన్లు భద్రంగా ఇచ్చిన డాక్టర్లు.. ఆమె సంఘటన జరిగినప్పుడు ధరించిన దుస్తులను మాత్రం ఇవ్వకుండా.. సింపుల్‌గా కాల్చేశామన్నారని ప్రత్యూష తల్లి తెలిపారు. హిమాయత్ నగర్ నుంచి కేర్ ఆస్పత్రి వరకు నగరం నడిబొడ్డున తమ బిడ్డను మృగాల్లా మూడుసార్లు రేప్ చేశారని.. అది కూడా వారికి అనుకూలమైన ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. చివరికి గొంతు తెరవలేకపోయిన బిడ్డ నోట్లో పాయిజన్ పోశారని ప్రత్యూష తల్లి తెలిపారు. 
 
గొంతు వద్ద ఓవైపు నాలుగు గోళ్ల గాట్లు.. మరోవైపు ఓ గాటు వుందని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వైద్యులు ట్రీట్మెంట్ కోసం వేసిన గాట్లని చెప్పారని ప్రత్యూష తల్లి వాపోయారు. అధికారం, డబ్బు వున్నవారు ఏమైనా చేయొచ్చునని.. అలా చేసినా వారికి న్యాయం జరుగుతుందని.. డబ్బు లేకపోతే.. అధికారం లేకపోతే పేదింటి వారి అమ్మాయిలు ఇలా బలైపోతారనేందుకు ప్రత్యూష ఘటనే నిదర్శనమని చెప్పారు. 
 
ప్రత్యూష చనిపోయి 16 ఏళ్లు గడిచినా.. ఆమె తమ్ముడు కైట్, క్రాకర్స్ కాల్చట్లేదని.. తండ్రి పోయిన కొన్ని సంవత్సరాల్లో అక్క కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ప్రత్యూష తమ్ముడు బాధపడుతున్నాడని ఆమె తెలిపారు. డబ్బు, అధికారం వుందనే అహంతో ప్రత్యూషపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆపై హత్య చేశారని వాపోయారు. వారింట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. ఆ బాధేంటో తెలిసేదని ప్రత్యూష తల్లి తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments