Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు ఆ స‌మ‌స్య తీర‌లేదు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (20:04 IST)
RRR pramotion
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమా ప్ర‌మోష‌న్ బాగానే జ‌రుగుతుంది. అయితే ఎక్క‌డో కొద్దిగా విడుద‌ల అనుమానం నెల‌కొంది. దేశంలో డిల్లీ, మ‌హారాష్ట్ర, యు.పి. వంటి ప్రాంతాల్లో నైట్ క‌ర్వూ వంటివి వుండ‌డం ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌కు నిరాశే క‌లిగింది. ఇక తెలంగాణ‌లో టిక్క‌ట్ల పెంపుకు ఓకే అన్న ప్ర‌భుత్వం ఎ.పి.లో ఇంకా స‌మ‌స్య తీర‌లేదు. 
 
ఎట్టి ప‌రిస్థితుల‌లో ఈ సినిమా జ‌న‌వ‌రి 7నే విడుద‌ల అవుతుంద‌ని రాజ‌మౌళి నొక్కి చెప్పినా అస‌లైన తెలుగు రాష్ట్రంలో ప‌రిస్థితి కుదుట ప‌డ‌లేదు.సీజ్ చేసిన థియేట‌ర్లు ఓపెన్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా టిక్క‌ట్ల పెంపు విధానం ఇంకా స‌మ‌సిపోలేదు. ఓవ‌ర్‌సీస్‌లో ఆశాజ‌న‌కంగా వున్నా మ‌న ద‌గ్గ‌ర అంత‌గా లేదు. దీనిపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.
 
తాజాగా ఎ.పి. ప్ర‌భుత్వంతో ఓ క‌మిటీని నియ‌మించింది. అందులో ప‌లువురు మేథావులు వున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వారికి ఎటువంటి స‌మాచారం లేదు. ఎప్పుడు ఎలా మీటింగ్ జ‌రుగుతుందో తెలియ‌డంలేదు. బ‌హుశా జ‌న‌వ‌రి 1,2 తేదీల్లో పిలుపు రావ‌చ్చ‌ని క‌మిటీ స‌భ్యుల్లో ఒక‌రైన నారాయ‌ణ తెలియ‌జేస్తున్నారు. 
 
భారీ సినిమా సాధారణ రేట్లు తోనే ఏపీలో ప్రదర్శితం కానుంద‌ని వార్త బాగా వినిపిస్తోంది.  ఎ.పి. ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్ష్ అధ్య‌క్షుడు కానీ, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి విజ‌య్‌చంద‌ర్ కానీ దీనిపై స్పందించ‌డంలేదు. త్వ‌ర‌లో అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిస్కారం అవుతుంద‌ని మాత్ర‌మే తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

పెంపుడు శునకానికి పిల్లలు... వేడుకగా బారసాల (వీడియో వైరల్)

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments