Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్ అనేది గుడి కంటే గొప్పది - ర‌జ‌నీకాంత్‌తో రాజ‌కీయాలు మాట్లాడ‌ను- కమల్ హాసన్

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (16:36 IST)
Kamal Haasan,
కమల్ హాసన్ కథానాయకుడి గా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక  చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా మీడియాతో 'విక్రమ్' చిత్రం విశేషాలు పంచుకున్నారు కమల్ హాసన్. ఆయన చెప్పిన విక్రమ్ విశేషాలివి.
 
'విక్రమ్' ట్రైలర్ లో అడవిలో వేట అన్నట్టుగా చూపించారు.. వేటకి సంబధించిన ఫిలాసఫీ కూడా చెప్పారా ?
ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే అనుకుంటే..  ఇది కూడా అడవే.  క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు.  విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.
 
ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉండేలా చూసుకుంటారు కదా.. విక్రమ్ లో మీకు ఛాలెంజ్ అనిపించిన అంశం ఏమిటి ?
ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బావుండటం రెండూ ఛాలెంజులే.  మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్ కి వుంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం వున్న బాలచందర్, విన్సెంట్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ.
 
విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్లు కూడా వున్నారు కదా..  వాళ్ళ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?
నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. పోతురాజు  సినిమాలో పశుపతి,  అన్బే శివంలో మాధవన్ పాత్రలు ఎంతో బలమైనవి.
 
సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తాజాగా కలిశారు కదా.. మీ మధ్య ఎలాంటి అంశాలు చర్చలోకి వస్తుంటాయి?
మేము తరచుగా కలుస్తూనే వుంటాం. గత నలభై ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు గురించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. 'విక్రమ్ సినిమాకి చాలా మంచి వైబ్రేషన్స్ వున్నాయి, కంగ్రాట్యులేషన్స్ '' అని రజనీ చెప్పారు.
రాజకీయాలు గురించి కూడా మాట్లాడుతుంటారా ?
చాలా తక్కువ. మా ఇద్దరిది భిన్నమైన ఫిలాసఫీ. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవిస్తాం.
 
సూర్యతో ఫుల్ లెంత్ సినిమా భవిష్యత్ లో వుంటుందా ?
మా బ్యానర్ లో సూర్యతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. ఈ లోగా విక్రమ్ లో స్పెషల్ ఎప్పిరియన్స్ రోల్ చేశారు. ఐతే సూర్యతో తప్పకుండా సినిమా చేస్తాం. దాదాపు ఐదుగురు దర్శకులతో మాట్లాడాం. మహేశ్ నారాయణ్ తో మా బ్యానర్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. మలయాళంలో మాలిక్ లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారాయన. మహేశ్ నారాయణ్ గతంలో విశ్వరూపంకు ఎడిటర్ గా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో సినిమాటోగ్రఫీ కూడా నేర్చ్సుకున్నారు.
 
తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు ?
నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైయింది. దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
మీరు చేసే ప్రతి సినిమా ప్రతి భాషలోకి వెళుతుంది. ఇది ఎప్పటి నుండో వుంది. కానీ ఇప్పుడది పాన్ ఇండియా ట్రెండ్ అయ్యింది. దిన్ని ఎలా చూస్తారు ?
ట్రెండ్ అనేది కొత్త న్యూస్ అంతే. చరిత్ర చూస్తే ఇది ఎప్పటి నుండో వుంది. ఏ ఎన్ ఆర్ గారి దేవదాస్ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది. 'మరో చరిత్ర'కి కూడ ఇదే జరిగింది. 'సాగర సంగమం' డబ్ చేశారు. ఇది కూడా అక్కడ సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకుంది. అలాగే స్వాతిముత్యం. పాన్ ఇండియా అనేది బాలచందర్ లాంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్ చేశారు.
 
మీరు కూడా తెలుగు, తమిళ అని కాకుండా ఇండియన్ సినిమా అనడానికే ఇష్టపడతారు కదా ?
అవునండీ. ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్ గా వుంది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డి గారి లాంటి దర్శకులు మాయాబజార్ లాంటి చిత్రాలని తెలుగు తమిళ్ లో తీసేవారు. రాముడు భీముడు తెలుగు , ఎంగవిట్టి పిళ్ళై తమిళ్ ,  రామ్ ఆర్  శ్యామ్  హిందీ .. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు బాహుబలి. పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుండో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి.రామానాయడు గారు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్ ప్రోడ్యుసర్, పాన్ ఇండియా ప్రోడ్యుసర్.
 
ఓటీటీ లో కూడా ఇంత మార్పు వస్తుందని మీరు ముందే గ్రహించారు కదా ?
ఓటీటీ మార్పు రావాలని నేనేం పట్టుపట్టలేదు. అది కచ్చితంగా రావాలి. ఇప్పుడు వచ్చింది.  ఐతే ఎన్ని మార్పులు వచ్చినా దేని ప్రాధన్యత దానికి వుంటుంది. చేతికి పెట్టుకునే వాచ్ వచ్చిందని టవర్ క్లాక్ కి డిమాండ్ తగ్గలేదు కదా. తిరుపతి క్యాలెండర్ ఇంట్లో ఉన్నంత మాత్రాన అక్కడ భక్తుల రద్దీ తగ్గిపోదు కదా. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కూడా అంతే. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. ఎందుకంటే పక్కనున్నవాడు ఏ జాతి, మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు. ఇది కేవలం స్పోర్ట్స్, సినిమా థియేటర్ లోనే సంభవిస్తుంది,
 
ఒకప్పుడు మీ సినిమాని నేరుగా టీవీ లో రిలీజ్ చేస్తామంటే గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు కదా ?
కొత్తది ఏది వచ్చినా మొదట భయం వేస్తుంది. పిజ్జా ని చూసి కూడా మొదట ఇలానే ఫీలై ఉంటాము కదా.. అయితే కేవలం ఫిజ్జానే తినాలంటే ఒప్పుకోము.  మనకి ఉలవచారు కూడా ఇష్టం. అన్నీ రుచులు వుంటాయి. అయితే ఫైనల్ గా ఒక ఒరిజినల్ రుచి బయటికి వస్తుంది. ప్రేక్షకుడు అంతిమంగా సినిమాని థియేటర్ లో చూడటానికే ఇష్టపడతాడు. మనందరికీ కిచెన్ వుంటుంది. కానీ ఒకరోజు ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా హోటల్ లో భోజనం చేస్తాం కదా. ఇదీ అంతే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments