Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ, నిత్యామీనన్, అఖిల్‌కు హ్యాపీ బర్త్ డే.. పెళ్లి రద్దైన సిసింద్రీ స్పెషల్ విషెస్..

టాలీవుడ్ యంగ్ తారలైన అల్లు అర్జున్, నిత్యామీనన్, అఖిల్ అక్కినేనిల పుట్టిన రోజు (ఏప్రిల్ 8) వేడుకలను ఫ్యాన్స్ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక అఖిల్ రెండో సిని

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (12:17 IST)
టాలీవుడ్ యంగ్ తారలైన అల్లు అర్జున్, నిత్యామీనన్, అఖిల్ అక్కినేనిల పుట్టిన రోజు (ఏప్రిల్ 8) వేడుకలను ఫ్యాన్స్ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక అఖిల్ రెండో సినిమాపై కన్నేశాడు. అలాగే హీరోయిన్ అయిన నిత్యామీనన్.. గుర్తింపు లభించే పాత్రలు చేసుకుంటూ పోతోంది. యంగ్ హీరోగా యమా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. తాజాగా దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు.

లింగుస్వామి దర్శకత్వంలోనూ మరో సినిమా చేస్తున్నాడు. అలాగే వక్కంతం వంశీ చిత్రంలోనూ బన్నీ నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. తన బర్త్ డేను అల్లు అర్జున్ ఇటీవల గోవాలో తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. బన్నీ బర్త్ డేని పురస్కరించుకుని దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఇక నిత్యామీనన్ ప్రస్తుతం విజయ్ 61వ సినిమాలో నటిస్తోంది. ఈ తమిళ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. అలాగే అఖిల్ అక్కినేని.. పెళ్ళి రద్దు కావడంతో సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే కొత్త సినిమాలో అఖిల్ నటిస్తాడని తెలుస్తోంది. ఇంకా విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం.

ఏప్రిల్ 8న పుట్టిన రోజు జరుపుకునే అల్లు అర్జున్, నిత్యామీనన్, అఖిల్‌కు మనం కూడా హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. వారి సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం.. ముఖ్యంగా అఖిల్‌కు ఇక సినిమాలు కలిసిరావాలని కోరుకుందాం.. పెళ్లి రద్దైనా భవిష్యత్తులో మంచి లైఫ్ రావాలని ఆశిద్దాం.. ఇక సోషల్ మీడియాలో ఈ తారలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments