Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లవి జోషి పూజతో ప్రారంభం అయిన ది వాక్సిన్ వార్ షూటింగ్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (17:56 IST)
pallavi joshi pooja
దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో సంచలనం సృష్టించారు. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలని అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 'కశ్మీర్ ఫైల్స్'తోసరికొత్త రికార్డులని క్రియేట్ చేసిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇటివలే తను తీయబోయే కొత్త చిత్రానికి  'ది వాక్సిన్ వార్' టైటిల్‌ ని ఖరారు చేశారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. 
 
పల్లవి జోషి దేవిని పాటలను పూజిస్తూ షూటింగ్ ప్రారంభించారు.  'ది వాక్సిన్ వార్' చిత్రం దేశంలో కోవిడ్ మహమ్మారి, టీకా కోసం జరిగిన కసరత్తులకు సంబధించిన అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారని ఇదివరకే విడుదల చేసిన టైటిల్, పోస్టర్ లో తెలియజేశారు. “మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు'' అనే సందేశం కూడా పోస్టర్ పై కనిపించింది.
 
భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ‘ది వ్యాక్సిన్ వార్’ నిర్మిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 11 భాషలలో 'ది వాక్సిన్ వార్'ని విడుదల చేయనున్నారు.
2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments