Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి : వాల్తేరు వీరయ్య నిర్మాత వై రవిశంకర్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (14:04 IST)
Raviteja, chiru, boby andteam
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న 'వాల్తేరు వీరయ్య' ఆల్బమ్ లోని  బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ 'వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్' కూడా సంచలన విజయం సాధించింది. భారీ అంచనాలు వున్న వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. వాల్తేరు వీరయ్య కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రెస్ మీట్ లో... మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
 
Waltheru Veeraiya crew
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే ఇదే ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లా వుంది. చాలా అద్భుతంగా వుంది. వాల్తేరు వీరయ్య సినిమాని అందరూ ప్రేమతో చేశారు. ఆ ప్రేమ వాల్తేరు వీరయ్య ప్రతి ఫ్రేమ్ లో ప్రతిబింబిస్తుంది. దర్శకుడు బాబీ కథ చెప్పినపుడు వినగానే నచ్చింది. ఇందులో కంటెంట్ బావుంది. కథపై వర్క్ చేసుకొని రమ్మన్నాను. బాబీ కథపై వర్క్ చేసుకొని వచ్చారు. మొత్తం వినగానే ఆ రోజే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. అదే నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇంత భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించడం ఆనందంగా వుంది. మనల్ని ఎలా చూపిస్తే బావుంటుందో అభిమానికే బాగా తెలుసు. అలాంటి అభిమాని దర్శకుడు గా వస్తే తప్పకుండా సినిమా చేయాలని ఒక సినియర్ హీరో చెప్పిన మాట నాలో ఎప్పటినుండో నాలో నాటుకుపోయింది. బాబీ, వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్సో నాకు తెలుసు. బాబీ ఈ కథతో వచ్చినపుడు తప్పకుండా గొప్పగా తెరపై ఆవిష్కరిస్తాడనే నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజు నిజమైయింది. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. చాలా గొప్పగా అందంగా చూపించాడు బాబీ. గొప్ప ఎమోషనల్ జర్నీ. బాబీ కి అడ్వాన్స్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్యపై ఎన్ని అంచనాలు పెంచుకున్నా దానికి మించే వుంటుంది.  వాల్తేరు వీరయ్య సమిష్టి కృషి. నాతో సినిమా అంటేనే దేవిశ్రీ ఎక్సయింట్ మెంట్ వేరు. ఇందులో అన్నిపాటలు అద్భుతంగా ఇచ్చాడు. మాస్ , క్లాస్, హృదయాన్ని కట్టిపడేసి పాటలు అన్నీ ఇందులో వున్నాయి. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. చంద్రబోస్ చక్కని సాహిత్యం అందించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎక్స టార్దీనరీ వర్క్ చేశారు. అలాగే పీటర్ హెయిన్స్ కూడా ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా వండర్ ఫుల్ వర్క్ చేశారు. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ ని పట్టేశారు. ఇందులో గ్యాంగ్ లీడర్ రోజులని గుర్తు చేసే కొన్ని మూమెంట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మా డీవోపీ ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఫైటర్స్ తో కలసి ఎలాంటి డూప్ లేకుండా పని చేస్తున్నపుడు మా డీవోపీ ఆశ్చర్యపోయారు. ఇలా ఏ హీరో చేయరని చెప్పారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు కానీ నాకు తెలిసిన విధానం ఇదే అని చెప్పాను. ఊర్వశి అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. బాస్ పార్టీ పాట కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. శ్రుతి హాసన్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమాలో చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు’’ అన్నారు.
 
 మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. అన్నయ్య తో సినిమా చేసినప్పుడు ఆ ఎక్సయిట్ మెంట్ వేరుగా వుంటుంది. బాబీ చెప్పిన కథ అద్భుతంగా వుంది. వాల్తేరు వీరయ్య ఓ పండగలా వుంటుంది’’ అన్నారు.
 
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేస్తున్నపుడు మన అభిమానం, ప్యాషన్ ఇవన్నీ పక్కన పెట్టిసి.. మనం ఆరాధించే దేవుడు, శక్తి, వ్యక్తి మన కళ్ళ ముందు వున్నపుడు సినిమాలో ఏం పెట్టాలో అన్నీ ఇందులో పెట్టేశాం. అన్నయ్య నన్ను ఓ తమ్ముడిలా చేయిపట్టి నడిపించారు. ఆయన కారణంగానే అద్భుతమైన కథ రెడీ అయ్యింది. సెకండ్ హాఫ్ మీద పని చేస్తున్నపుడు రవితేజ గారి లాంటి ఒక పాత్ర వుందని అన్నయ్య కి చెబితే.. ‘’బావుంది ఇదే చేస్తున్నాం’ అన్నారు. హ్యాట్సప్ టు యూ అన్నయ్య. కథ మొత్తం లాక్ అయిన తర్వాత రవితేజ గారికి చెప్పాను. కథ వినగానే సినిమాలో జాయిన్ అయిన రవితేజ గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్ పాత్ర అద్భుతంగా వుంటుంది. కేథరిన్ కూడా చక్కగా చేసింది.  దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. విల్సన్ గారు వండర్ పుల్ డీవోపీ అందించారు. ప్రకాష్ గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎక్స టార్డీనరీ ఫైట్స్ ఇచ్చారు.  బోస్ గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. బాస్ పార్టీ సాంగ్ లో ఊర్వశి అద్భుతమైన ఫెర్ ఫార్మ్ చేసింది. శేఖర్ మాస్టర్ చిరంజీవి గారి గ్రేస్ కి తగ్గట్టు పాటలకు కొరియోగ్రఫీ ఇచ్చారు. డ్యాన్సులని ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. రైటింగ్ డిపార్ట్ మెంట్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య మాస్ జాతర. మెగాస్టార్ వార్ కి వస్తే ఎలా వుంటుందో శంఖం ఊదితే ఎలా గూస్ బంప్స్ వస్తాయో .. ఒక ఎనిమిది నిమిషాల పాటు థియేటర్ మొత్తం పూనకాలని ఊరికే ట్యాగ్ పెట్టలేదని గట్టి నమ్మకంతో చెబుతున్నాను. పూనకాలు లోడింగ్ హైప్ కోసం పెట్టింది కాదు. మనకు ఎన్నో సార్లు పూనకాలు ఇచ్చిన అన్నయ్య కి తిరిగి చిరు కానుక గా ఇస్తున్న సినిమా ఇది’’ అన్నారు.
 
 నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. జీవితంలో ఇదో గొప్ప అవకాశం. మెగాస్టార్ చిరంజీవి గారు వేదికపై వుండగా మాట్లాడే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు పెద్ద విజయం. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారిని సంప్రదించిన వెంటనే మరో ఆలోచన లేకుండా 'అన్నయ్య సినిమా నేను చేస్తా'అని చెప్పిన మాస్ మహారాజ రవితేజ గారికి కృతజ్ఞతలు. చిరంజీవి, రవితేజ గారి కాంబినేషన్ లో కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. శ్రుతి హాసన్ గారు ఇందులో అద్భుతంగా కనిపిస్తారు.  బాస్ పార్టీ సాంగ్ లో చేసిన ఊర్వశి రౌతేలా కూడా చక్కగా వుంది. ఇందులో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్..లాంటి పెద్ద కాస్టింగ్ వుంది. బాబీ గారు బెస్ట్ టీం సెలెక్ట్ చేసుకున్నారు. సంక్రాంతి లాంటి పండక్కి ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గొప్ప సినిమా ఇచ్చినందుకు దర్శకుడు బాబీ గారికి చాలా థాంక్స్. ప్రకాష్ గారు అద్భుతమైన సెట్స్ వేశారు. విల్సన్ గారు, శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ అందరూ అద్భుతంగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ చిత్రానికి నాలుగో పిల్లర్. మైత్రీ విజయంలో దేవిశ్రీ ఒక మెయిన్ పిల్లర్. మా సినిమాలన్నిటికీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. మాస్ మహారాజ గారి ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ విజయం  అవ్వడం మాకు ఎంతో సంతోషంగా వుంది. వాల్తేరు వీరయ్యలో ఆయన విశ్వరూపం చూస్తారు.  ఇంద్ర సినిమా పాటలకి ఎంత పెద్ద పేరు వచ్చిందో ఆ పాటల రిక్రియేషనే మా వాల్తేరు వీరయ్య. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారు ఎంత అందంగా వున్నారో దానికి రెండు రెట్ల అందంగా వాల్తేరు వీరయ్యలో వున్నారు. వాల్తేరు వీరయ్య కంటెంట్ ఎక్స్ టార్డీనరీ గా వుంటుంది.'' అన్నారు
 
 నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య కంటెంట్ విన్నప్పుడు మళ్ళీ మెగా హిట్ అనిపించింది. ఇదో అద్భుతమైన సినిమా అనడానికి కారణం.. ఏ పాత్రలు ఎవరు వెయ్యాలో వాళ్ళే వేశారు. ఎక్స్ టార్డీనరీ క్యారెక్టరైజెన్స్. సంక్రాంతికి నిజమైన పండగ వాల్తేరు వీరయ్య.  అందరూ ఎక్స్ టార్డీనరీ గా పని చేశారు.  సినిమా పరిశ్రమలో నాకు మిత్రుడని చెప్పగలిగే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో మళ్ళీ పని చేసే అవకాశం ఇచ్చిన బాబీకి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేరక్స్ తో మళ్ళీ పని చేయడం అనందంగా వుంది.’’ అన్నారు.
 
 రాక్ స్టార్ దేవిశ్రీ మాట్లాడుతూ..ముందుగా దర్శకుడు బాబీ గారిని అభినందించాలి. మెగాస్టార్ ఒకవైపు మాస్ మహరాజా మరోవైపు.. ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ కథని తయారు చేయడమే పెద్ద సవాల్. ముందు దీని కోసమే బాబీకి క్లాప్స్ కొట్టాలి. నిజంగా చాలా అద్భుతంగా తీశారు. చిరంజీవి గారు, రవితేజ గారు కలసి సినిమా చేస్తారని.. ఈ కథ చెప్పినపుడే చాలా ఆనందంగా వుంది. వారిద్దరూ అందరికీ స్ఫూర్తి. ఇందులో చిరంజీవి గారు, రవితేజ గారు ఎమోషన్స్ ని అద్భుతంగా పండించారు. వారికి హాట్స్ ఆఫ్. ఇందులో మెగామాస్ సాంగ్ న్యూఇయర్ కి గిఫ్ట్ గా రాబోతుంది. ఇది థియేటర్ లో పండగలా వుంటుంది. ఇంత పెద్ద సినిమాని నిర్మించిన మైత్రీమూవీ మేకర్స్ కి హాట్స్ ఆఫ్. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, ఫెర్ఫార్మేన్ .. ఇందులో దేనికి ఏదీ తగ్గకుండా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రేక్షకులు అంతా ఎంజాయ్ చేస్తారు. జనవరి 13న థియేటర్స్ లో పార్టీ'' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments