Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన ఫ్యాషన్ ఐకాన్ తండ్రి అంటోన్న‌ జాన్వి క‌పూర్‌, అర్జున్ క‌పూర్‌

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:29 IST)
Bonnie Kapoor
శ్రీ‌దేవి త‌న‌య జాన్వి క‌పూర్‌, త‌న‌యుడు అర్జున్ క‌పూర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్స్ ఆఫ్ ది న్యూస్‌గా మారిపోయారు. త‌మ తండ్రి బోనీ క‌పూర్‌కు ఫ్యాష‌న్ ప‌ట్ల మంచి అవ‌గాహ‌న ఉంది. దాన్ని వీళ్లిద్ద‌రూ పుణికిపుచ్చుక‌న్న‌ట్టు ఉన్నారు. అందుకే త‌మ తండ్రికి ఉన్న ఫ్యాష‌న్ సెన్స్‌ని గౌర‌విస్తూ ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా తండ్రి బోనీక‌పూర్‌కి ఉన్న ఫ్యాష‌న్ సెన్స్‌ని ప్ర‌శంసించింది జాన్వి. అప్పుడ‌ప్పుడు త‌న కుటుంబ స‌భ్యుల ఫోటోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది జాన్వి. అలాగే త‌న తండ్రికి త‌ను ఎంత స‌న్నిహితంగా ఉంటుందో తెలియ‌జేస్తుంది. జాన్వీ తండ్రి బోనీ క‌పూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాయల్ బ్లూ కోటు, తెల్లటి ష‌ర్ట్‌ మరియు నల్లటి ప్యాంటుతో అతని ముఖంపై మనోహరమైన చిరునవ్వుతో పోజులివ్వడాన్ని చూడవచ్చు. 
 
- జాన్వీ తన పోస్ట్‌తో పాటు రాడ్ డాడ్ స్టిక్కర్‌తో ఉంది. 'నిజమైన ఫ్యాషన్ ఐకాన్ ఒకరి తండ్రి అయినప్పుడు' అని త‌న తండ్రి బోనీక‌పూర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అంతే కాకుండా జాన్వి తరచుగా తన చెల్లెలు ఖుషీతో అందమైన ఫోటోలను ట్వీట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌తో వారి సన్నిహిత సంబంధాన్ని వెల్లడిస్తుంది.
 
- ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో ఒక రోజు గ‌డిపిన జాన్వి అక్క‌డి వీధుల్లో తిరుగుతున్న కొన్ని ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. ఆరోజు జాన్వీ కపూర్ లుక్ చాలా క్యాజువల్‌గా ఉంది. ఆమె డ్రెస్ మీద పెద్ద జాకెట్ వేసుకుంది. ఆమె పర్యటన కోసం ఒక జత బూట్లను ఎంచుకుంది. ఆమె తన అభిమానులను మళ్లీ తనతో ప్రేమలో పడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఆమె ఎప్పుడూ ఫ్యాషన్ ఐకాన్‌గా ఉంది. 
 
 తండ్రి త‌ప్ప ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు
జాన్వీ కపూర్ ఇటీవల ఆదిత్య సీల్ మరియు అనుష్క రంజన్‌ల పెళ్లిలో క‌నిపించింది. ఆమె యాక్టింగ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆమె తదుపరి సిద్ధార్థ్ సేన్‌గుప్తా యొక్క గుడ్ లక్ జెర్రీలో కనిపించనుంది. అంతేకాదు మ‌ల‌యాళ సినిమా హెలెన్ రీమేక్ మిలిమిలిలో న‌టిస్తోంది. దుబాయ్ హాలీడే ట్రిప్‌కి బ‌య‌లుదేరే ముందు ఈ సినిమాలో న‌టించ‌బోతోంది. ఈ సినిమా చేయ‌డాన్ని తండ్రి బోనీక‌పూర్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ స‌పోర్ట్ చెయ్య‌లేదు. ఇవి కాక‌, అజయ్ దేవగన్ నటించిన మైదాన్, అజిత్ కుమార్ మరియు హుమా ఖురేషి నటించిన తమిళ చిత్రం వాలిమైతో సహా అనేక ఇతర ప్రాజెక్ట్‌ల‌తో ఎంతో బిజీగా ఉంది జాన్విక‌పూర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై దుండగుడి పిడిగుద్దులు... మృతి!!

జగన్ ఓ అరాచకవాది .. కాంగ్రెస్‌తో చేరి మోడీ సర్కారును అస్థిపరిచేందుకు కుట్ర : బీజేపీ ఎమ్మెల్యే

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలకు వైకాపా సపోర్ట్... ఓం బిర్లాకు మద్దతు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments