Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోట్ ఎపిసోడ్ కోసం గోవా వెళుతున్న పుష్ప టీమ్‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:17 IST)
Allu arjun Pushpa
అల్లు అర్జున్, రష్మిక జంటగా న‌టిస్తున్న `పుష్ప` మూవీ తాజా షెడ్యూల్‌లో గోవాలో జ‌ర‌గ‌నుంది. అక్క‌డ కీల‌క‌మైన స‌న్నివేశాలతోపాటు హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌ను తీయ‌నున్నారని స‌మాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిస్తున్నారు. అందుకే మొద‌ట గోదావ‌రి జిల్లాల‌లోని అట‌వీ ప్రాంతాల‌న్నీ చుట్టేశారు. ఆ త‌ర్వాత కేర‌ళ వెళ్ళారు. ఇప్పుడు గోవాలో కొండ‌వాగులు, సెల‌యేర్టు వున్న ప్రాంతంలో బోటింగ్ పై యాక్ష‌న్ సీన్స్ తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దానికోసం విదేశీ టీమ్‌కూడా పాల్గొన‌నుంద‌ట‌. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న‌ది తెలిసిందే.
 
మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడు. గందపు స్మ‌గ్లింగ్ సూత్ర‌దారి ఆయ‌నే. ఆయ‌న‌కో పొలిటీష‌న్ అండ వుంటుంది. అది బాలీవుడ్ న‌టుడు న‌టిస్తున్నాడు.ఇంకా జగపతి బాబు , ప్రకాష్ రాజ్, ధనంజయ్, సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సుకుమార్  హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో వ‌స్తోన్న మూడ‌వ సినిమా ఇది
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments