Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభమైన శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ఆటో రజిని

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (16:27 IST)
Auto Rajani opening
జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి.జె నిర్మిస్తున్న  చిత్రం `ఆటో రజిని`.  పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో సినీ,రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. బాపట్ల ఎం. పి నందిగం సురేష్ తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్దార్థరెడ్డి, గౌతంరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ, ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మా జొన్నలగడ్డ శ్రీను కుటుంబానికి ఆర్థికంగా మంచి లాభాలు రావాలని అదేవిధంగా దీంట్లో నటించే నటీనటులకు టెక్నీషియన్స్ లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి. హీరో, హీరోయిన్స్ అందరు కూడా పదికాలాలపాటు ఇండస్ట్రీలో నటీనటులుగా వెలుగొందాలని ఈ సినిమాకు దేవుడు ఆశీస్సులు ఉండాలి.ఈ సినిమాలో నటించే నటులకు, టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు. 
 
బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ, జనాల్లో ఎప్పటికీ సినిమా గుర్తుండిపోయేలా మంచి సినిమా తీయాలనే విషయాన్ని నాతో చెప్పేవాడు. ఆ రోజు అన్న ఏదైతే నాతో చెప్పాడు అదే ఈ రోజు జరుగుతుంది. హరికృష్ణ హీరో గా మాస్ లీడర్ గా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ఆటో రజిని అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు తమిళనాడు సినిమా తెలుగులో డబ్ చేశారు అనుకున్నాను కానీ ఇందులో డైలాగ్ విన్న తరువాత తెలుగు సినిమా ఎలా ఉండాలో అలా మంచి చిత్రం గా ఉండేలా తీస్తున్నారు. ఇందులో కొన్ని  సన్నివేశాలు మాకు చెప్పినప్పుడు సినిమా తీయడానికి చాలా క్లారిటీ గా ఉన్నారు. హరికృష్ణ కు ఈ సినిమా తర్వాత హీరోగా ఎన్నో సినిమాలలో నటించే అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాలి. ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి  శ్రీనివాస్ అన్నకు ,హరికృష్ణ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలి అని తెలిపారు..
 
చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్ద పెద్ద హీరోల సినిమాలకు వర్క్ చేశాను. `ఎదురులేని మనిషి` చేసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. కొడాలి నాని, సురేష్,, సిద్దా రెడ్డి, గౌతంరాజు ఇలా అందరూ వచ్చి మా "ఆటో రజని" మూవీని బ్లెస్స్ చేయాడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు నాకు సినిమా తీస్తే బాగా ఆడుతుందని ధైర్యం  వచ్చింది ఈ సినిమాకు జగనన్న ఆశీస్సులు తీసుకొని వచ్చాను. 
 
లవ్ అండ్ యాక్షన్ మూవీ తీస్తున్నాం. వైజాగ్ విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి విజయవాడలో షూటింగ్ ప్రారంభం అవుతుంది.  అక్టోబర్ నవంబర్ లో సినిమా పూర్తి చేసుకుని హాలిడేస్ లో విడుదల చేస్తాం.ఇంతవరకూ నేను తీసిన సినిమా రిలీజ్ చేసుకోవడానికి భయపడేవాడిని. 30 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో  అందరి హీరోలతో చేశాను. సరైన సపోర్ట్ లేక నిలబడ‌లేక పోయాను. ఈరోజు ఇంత ఇంత మంది అన్నలు నాకు సపోర్ట్ గా ఉన్నందుకు నాలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నా సినిమాను కచ్చితంగా రిలీజ్ చేసుకుంటాననే ధైర్యం ఉంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.
 
చిత్ర నిర్మాత సావిత్రి.జె. మాట్లాడుతూ.. మంచి మెసేజ్ తో లవ్ అండ్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న `ఆటో రజని` ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. 
 
 చిత్ర హీరో జొన్నలగడ్డ హరికృష్ణ మాట్లాడుతూ, ఇది నా రెండో సినిమా నా మొదటి మూవీ  ఆడియో కి జగనన్న గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా ఈ అన్నలు అందరు నాకు సపోర్ట్ గా నిలిచి నీకు మేమున్నామంటూ మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నా రెండో సినిమాకు ఫంక్షన్ కు పిలవగానే ఎంతో ప్రేమతో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది .ఈ "ఆటో రజిని" ఒక మాస్ సినిమా ఈ సినిమాలో నేను బై బర్త్ నుండి రజినీకాంత్ ఫ్యాన్ ని  ఇలాంటి మంచి సినిమాలో నటించే  ఛాన్స్ ఇచ్చిన మా తల్లి, తండ్రులకు  ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందులో  టెక్నీషియన్స్ అందరూ కూడా  చాలా కష్టపడి పని చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. 
 
చిత్ర హీరోయిన్ ప్రీత సేన్ గుప్తా మాట్లాడుతూ, మాది వెస్ట్ బెంగాల్ కలకత్తా ఇది నా మొదటి తెలుగు సినిమా ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. సిద్ధార్థ రెడ్డి, మధుసూదన్ రెడ్డి త‌దిత‌రులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments