Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న ఘాజీ వసూళ్లు: రెండు రోజుల్లో రూ. 9. 5 కోట్లు

రానా, తాప్సీ ప్రధానపాత్రలో దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన వార్‌డ్రామా ’ఘాజీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. తెలుగులోనూ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. చూసిన ప్

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (07:27 IST)
రానా, తాప్సీ ప్రధానపాత్రలో దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన వార్‌డ్రామా ’ఘాజీ’  బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. తెలుగులోనూ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందని చెప్తుండటంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.
 
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ’ఘాజీ’  తొలి రెండురోజుల్లో రూ. 9.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 4.25 కోట్లు సాధించిన ఈ సినిమా శనివారం మరింత మెరుగైన వసూళ్లు రాబట్టింది. ’ఘాజీ’కి పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ రావడంతో ఆదివారం కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండే అవకాశముందని సినీ పండితులు భావిస్తున్నారు.
 
’ఘాజీ ద అటాక్‌’ సినిమా తొలి రెండురోజుల్లో మొత్తం అన్ని వెర్షన్లలో కలుపుకొని రూ. 9.50 కోట్లు వసూలు చేసిందని, హిందీ వెర్షన్‌లో ఈ సినిమాకు రూ. 3.90 కోట్లు కలెక్ట్‌ చేసిందని సినీ ట్రేడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుండటంతో మున్ముందు వసూళ్లుపెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
 
 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments