నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి నుంచి మొదటి పాట ఈనెల 9న విడుదల

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:00 IST)
Nagashourya, Shirley Setia
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంది.
 
టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రేక్షకులని పాటలతో అలరించడానికి సిద్దమౌతుంది. ఈ చిత్రంలో మొదటి పాట 'వర్షంలో వెన్నెల' ఏప్రిల్9న విడుదల కాబోతుంది. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని చిత్రీకరీంచారు. ఈ పాటలో నాగశౌర్య- షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చట గా వుంటుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
 
డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments