Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశ వీధుల్లో ట్రైలర్ లోనే ద‌ర్శ‌కుడి ఉద్దేశం కనిపించింది:గోపీచంద్ మలినేని

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (16:11 IST)
Gautam Krishna, Poojitha, Gopichand
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని హాజరై ట్రైలర్ ని విడుదల చేసారు.
 
అనంతరం దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఈ టీమ్ ను అబినందించాలనే ఈ వేడుకకు వచ్చాను. గౌతమ్ దర్శకుడిగా మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. దర్శకత్వం మాత్రమే కాదు అటు హీరోగా కూడా చాలా ఇంటెన్స్ తో నటించాడు. ఇక తెలుగమ్మాయిలు తక్కువవుతున్న ఈ సమయంలో పూజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కొత్త టీం తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ, టీజర్ చాలా బాగుంది. దర్శకుడు గౌతమ్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా విషయంలో అందరు కొత్తవాళ్లే నేనే సీనియర్ని అని అనుకునేదాన్ని, కానీ ఈ సినిమా షూటింగ్ లో గౌతమ్ టాలెంట్ చూసాక షాక్ అయ్యాను. మొదటి సినిమాకే ఈ రేంజ్ లో కష్టపడి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అలాగే ఈ సినిమాకు ఆయనే హీరో ఇలా మొదటి సినిమాకే హీరో, డైరెక్టర్ ఒక్కడే అయ్యి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం మాములు విషయం కాదు. కానీ గౌతమ్ ఆ రెండు పనులు చక్కగా చేసి అదరగొట్టారు. జూడా శాండీ చక్కని సంగీతం అందించారు. ఒక పాటే విన్నాం .. అన్ని పాటలు వింటే అదిరిపోతాయి. అలాగే నిర్మాత మనోజ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి టీం అందరికి మంచి పేరు తెస్తుంది అన్నారు.
 
నిర్మాత మనోజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి.. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.
 
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. మనం ఏమిటో చేసి చూపిస్తేనే అందరు నమ్ముతారు. అందుకే మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ సినిమా కసితో చేసాం. ఇందులో ఓ మర్డర్ చేసిన వ్యక్తినో, గ్యాంగ్ స్టర్ నో హీరోగా చూపించలేదు. ఓ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ ఇది. చాలా నమ్మకంతో ఉన్నాం. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments