Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఆ సినిమాలు రిజెక్ట్ చేశా - సందీప్ మాధ‌వ్

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (07:59 IST)
Sandeep Madhav
వంగీవీటి, జార్జిరెడ్డి చిత్రాల హీరో సందీప్ మాధ‌వ్ త‌ను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ను రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో కెరీర్ స్లోగా సాగిపోతుంది. ఈ విష‌య‌మే ఆయ‌న స్పందిస్తూ,  అవును స్లోగానే వెళుతున్నా. మ‌ధ్య‌లో క‌రోనా వ‌ల్ల గేప్ తీసుకున్నా. ఆ త‌ర్శాత క‌థ‌లు సెట్ చేసుకోవ‌డంలో గేప్ వ‌చ్చింది. ఇప్పుడు ఫాస్ట్‌గా చేస్తున్నాను. వంగీవీటి, జార్జిరెడ్డి చేశాక ఏది బ‌డితే అది చేయ‌డంలేదు. నాకు సూటయ్యేవి చేస్తున్నా. ల‌వ్‌స్టోరీ క‌థ‌లు చాలా వ‌చ్చాయి. అందులో 16 ఏళ్ళ కుర్రాడి పాత్ర చేయ‌మ‌న్నారు. నాకు సూట్ కాదు అంటే, మీకెందుకు మీరు చూస్తూవుండ‌డి మిమ్మ‌ల్ని ఎక్క‌డికో తీసుకెళ‌తాం అంటూ కొంద‌రు నాకు భ‌రోసాలాగా చెప్పారు. దాంతో నాకు అనుమానం వ‌చ్చింది. నాకోసం ఇంత రిస్క్ చేస్తున్నారా? న‌న్నే రిస్క్‌లో ప‌డేస్తున్నారా! అనేది అర్థంకాక రిజెక్ట్ చేశానంటూ మ‌న‌సులోని మాట‌ను తెలియ‌జేశారు.
 
- నాకు సైన్స్ ఫిక్ష‌న్‌, యాక్ష‌న్ అంటే ఇష్టం. వ్యక్తిగ‌తంగా కామెడీ ఇష్టం. తాజాగా  `మాస్ మ‌హ‌రాజ్` అనే సినిమా చేస్తున్నా. రాజ్‌త‌రుణ్ కూడా ఇందులో వున్నాడు. అందులో కూడా 50 ఏళ్ళ వ్య‌క్తిగా చేస్తున్నా. అసీఫ్‌ఖాన్‌, ప్ర‌దీప్ రాజు నిర్మాత‌లు. కోత‌ల‌రాయుడు చేసిన సుధీర్ రాజా ద‌ర్శ‌కుడు. ఇది పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమా అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు సందీప్ మాద‌వ్ గంధ‌ర్వ అనే సినిమా చేశాడు. జులై 1న విడుద‌ల‌కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments