Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసింది : రానా దగ్గుబాటి

డీవీ
మంగళవారం, 12 నవంబరు 2024 (16:53 IST)
Sai madhav, Rana
ప్రశాంత్ వర్మ అమేజింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. మోడ్రన్ జనరేషన్ కి మైథాలజీ స్టోరీలు చెప్పడంలో మాస్టర్. ఈ కథని ఆయన రాయడం చాలా ఆనందంగా ఉంది. ఇది కృష్ణుడు, కంసుడు నుంచి స్ఫూర్తి పొంది రాసిన సోషల్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ.. ఒకరు అర్జునుడు మరొకడు కృష్ణుడు. ఈ కాంబినేషన్లో వస్తున్న 'దేవకీ నందన వాసుదేవ' సినిమా డెఫినెట్ గా ఒక స్పెషల్ మూవీ అవుతుంది అని రానా దగ్గుబాటి అన్నారు.
 
హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'తో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ రోజు, రానా దగ్గుబాటి, సందీప్ కిషన్ కలిసి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అశోక్ గల్లా, టీంకి శుభాకాంక్షలు తెలిపారు. 
 
హీరో రానా మాట్లాడుతూ, సాయి మాధవ్ గారు నాకు రుణపడి ఉన్నాను అని చెప్పారు. కానీ నేనే ఆయనకి రుణపడి ఉన్నాను. నాకు కృష్ణం వందే జగద్గురుంతో 'కృష్ణతత్వం' అంటే ఏంటో నేర్పించింది ఆయనే. ఆయనని ఎప్పుడు కలిసిన 'దేవుడంటే సాయం' అనే ఒక లైన్ గుర్తు ఉంటుంది. ఆ ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి నాకు వీలైన ఏ సహాయం చేయాలనుకున్న చేస్తాను. అంత మంచి తత్వాన్ని నేర్పించిన సాయి మాధవ్ గారికి థాంక్యూ సో మచ్. 
 
మానస మన తెలుగు అమ్మాయి.తెలుగులో మాట్లాడే అమ్మాయిని హీరోయిన్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకి రావడానికి కారణం అశోక్. మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సీయారిటీ, అశోక్ నాన్నగారైన జయదేవ్ గారి విజన్, ఎక్స్పోజర్.. ఈ రెండుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అశోక్ కి ఆల్ ద వెరీ బెస్ట్.  హీరో సినిమాలో తనను చూశాను. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాను. తనలో చాలా గ్రోత్ కనిపించింది. 22 నవంబర్ ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సినిమాని ఎంజాయ్ చేయండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments