Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ రూటులో బన్నీ.. అభిమానుల ఆడియో ఫంక్షన్లకు వెళ్తాడట.. అర్థరాత్రి తమన్ ప్రకటన

టాలీవుడ్‌లోనే కాదు.. రాజకీయాల్లోనూ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించే టాక్. గతంలో తన సినిమాలకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించని పవన్ కళ్యాణ్, ఇటీవల కాస్త రూటు మార్చి.. తన అభిమాని సినిమా ఆడియో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (13:16 IST)
టాలీవుడ్‌లోనే కాదు.. రాజకీయాల్లోనూ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించే టాక్. గతంలో తన సినిమాలకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించని పవన్ కళ్యాణ్, ఇటీవల కాస్త రూటు మార్చి.. తన అభిమాని సినిమా ఆడియో ఫంక్షన్‌లో కనిపించి హంగామా చేశారు. నితిన్ లాంటి యంగ్ హీరోస్‌ను సపోర్ట్ చేయటమే కాదు. సప్తగిరి లాంటి కమెడియన్ హీరోగా మారుతున్న సినిమా ఆడియో వేడుకకు కూడా హాజరై ఎంకరేజ్ చేస్తున్నాడు.
 
ప్రస్తుతం ఇదే బాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పయనించనున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ, రెండు చిన్న సినిమాల ఆడియో వేడుకల్లో హాజరవుతారని సినీ వర్గాల్లో టాక్. 
 
నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్‌లో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ఆడియో రిలీజ్‌కు కూడా బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిసింది. 
 
ఇకపోతే.. తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసిన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ పవన్‌కల్యాణ్‌తో మినహా దాదాపు తెలుగు స్టార్‌ హీరోలందరితోనూ పనిచేశాడు. 
 
ప్రస్తుతం ఆ లోటు కూడా తీరబోతోంది. 'పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తర్వాతి సినిమాకు నేను సంగీత దర్శకుడినం'టూ సోమవారం అర్ధరాత్రి ప్రకటించాడు థమన్. పవన్‌ సినిమాకు కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఏఎం రత్నం నిర్మాతగా నీశన్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే థమన్‌ సంగీత దర్శకుడిగా ఫిక్స్‌ అయ్యాడని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments