జవాన్‌లో అతిథి పాత్రలో కోలీవుడ్ హీరో విజయ్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (11:25 IST)
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ జవాన్. పఠాన్ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కింగ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న జవాన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
 
షారుక్ ఖాన్, నయనతార నటించిన ఈ జవాన్ చిత్రంలో విజయ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సౌత్, నార్త్ టాప్ హీరోలు ఈ మధ్య ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నారు. 
 
ఇటీవల వెంకటేష్, రామ్ చరణ్ సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ అతిథి పాత్రలో నటించారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. 
 
విజయ్ ఇప్పటికే దర్శకుడు అట్లీతో మూడు సినిమాలు చేశాడు. అందుకే జవాన్‌లో అతిథి పాత్రను అంగీకరించాడు. ఈ జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. 
 
దర్శకుడు అట్లీ జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగి బాబుతో పాటు సౌత్, నార్త్‌లోని అగ్ర నటులందరినీ చూపించబోతున్నాడు. సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 40మంది ప్రయాణీకులకు ఏమైంది?

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగం - కేరళ సీఎం వివరణ

Caravan Tourism: ఆంధ్రప్రదేశ్‌లో కారవాన్ టూరిజం.. బాపట్ల, విశాఖలో ట్రయల్

Stray Dogs: ఫిబ్రవరిలో 2.3 లక్షల వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్

కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యాంకు లాకర్‌లో 40 కేజీల బంగారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments