Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మాస్టర్ బర్త్ డే.. దళపతిని హత్తుకున్న ఫోటోలు వైరల్ అండ్ ట్రెండ్

Webdunia
శనివారం, 3 జులై 2021 (19:43 IST)
Vijay
జానీ మాస్టర్ బర్త్ డే శుక్రవారం. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో జానీ మాస్టర్ పేరు మార్మోగిపోయింది. అయితే నిన్న జానీ మాస్టర్ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అందుకే అక్కడే టీం బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది. ఈ వేడుకలో దళపతి విజయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక దళపతి చూపిన ప్రేమకు జానీ మాస్టర్ ఫిదా అయినట్టు ఆ ఫోటోలను చూస్తేనే తెలుస్తోంది. 
 
సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న బీస్ట్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలా జానీ మాస్టర్ బర్త్ డే సెట్స్‌పైనే మేకర్స్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడంతో జానీ మాస్టర్ గాల్లో తేలిపోయారు. దళపతిని గట్టిగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ జీవితానికి ఇది చాలు అన్నట్టుగా బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇకపోతే.. జానీ మాస్టర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. రౌడీ బేబీ పాటలో జానీ మాస్టర్ పాత్ర, బుట్టబొమ్మ పాటకు కంపోజ్ చేసిన కూల్ స్టెప్స్ అన్నీ కూడా జానీ మాస్టర్‌ను పాపులర్ చేశాయి. కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. 
 
ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కోలీవుడ్‌లోనూ దూసుకుపోతోన్నారు. ఇక ఉత్తరాదినా సత్తా చాటేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే జానీ మాస్టర్ లెవెల్‌ సోషల్ మీడియాలో మామూలుగా లేదు. ఓ కొరియోగ్రాఫర్‌ బర్త్ డే సందర్బంగా నేషనల్ వైడ్ హ్యాపీ బర్త్ డే విషెస్ ట్రెండ్ అవ్వడం మామూలు విషయం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments