Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పేట' వర్సెస్ 'విశ్వాసం' - కత్తులతో ఫ్యాన్స్ కొట్లాట

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి రెండు మూడు రోజుల ముందుగానే వచ్చినట్టుగా ఉంది. తమతమ అభిమాన హీరోల చిత్రాలు ఒకేరోజు విడదలయ్యాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. రజినీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు జనవరి పదో తేదీ గురువారం విడులయ్యాయి. 
 
దీంతో ఈ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద సందడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు చిత్రాలు పక్కపక్క థియేటర్లలో ఆడుతుంటడంతో ఇరు హీరోల అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చెన్నై నగరంలోన రోహిణి థియేటర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు కత్తులతో పోట్లాడుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. 
 
అలాగే, మదురైలోని ఓ థియేటర్‌లో ఇరు హీరోల అభిమానుల మధ్య తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments