Webdunia - Bharat's app for daily news and videos

Install App

'టెర్రర్‌' పుట్టించే పోలీస్‌: మార్చి 4న విడుదల

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (11:19 IST)
శ్రీకాంత్‌, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమ్‌ సమర్పణలో సతీష్‌ కాసెట్టి దర్శకత్వంలో షేక్‌ మస్తాన్‌ నిర్మించిన సినిమా 'టెర్రర్‌'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ కాసెట్టి మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో టెర్రరిజం సమస్య ఉంది.

హైదరాబాద్‌లో ఓ టెర్రర్‌ యాక్టివిటీ జరుగుతుందని తెలుసుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా ఆ బాంబ్‌ బ్లాస్ట్‌ను చేధించాడు అనేదే ఈ సినిమా. 'టెర్రర్‌' అనేది టెరరిజం బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే ఓ పోలీస్‌ కథ. మార్చి 4న సినిమా రిలీజ్‌ అవుతోంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
 
శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. 'కచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఒక క్లీన్‌ ఫిలిమ్. సినిమాకు అవార్డ్స్‌ కూడా ఎక్స్పెక్ట్‌ చేస్తున్నాం. కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉండే సినిమా. అవుట్‌ పుట్‌ బాగా వచ్చింది. సతీష్‌ బాగా హ్యాండిల్‌ చేశాడు. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
 
నిర్మాత షేక్‌ మస్తాన్‌ మాట్లాడుతూ 'నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. సరైన సమయంలో సినిమాను రిలీజ్‌ చేయాలని ఆలోచించి మార్చి 4న రిలీజ్‌ చేస్తున్నాం. అందరి ఆశీస్సులతో అఖండ విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. లక్ష్మి భూపాల్‌ మాట్లాడుతూ.. 'అందరు ఇష్టపడి చేసిన సినిమా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా ఖచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుంది. మంచి కాన్సెప్ట్‌ ఉన్న ఫిలిం'' అని తెలిపారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments