Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఆలయం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:20 IST)
తెలుగు ఇండస్ట్రీలోకి ఇటీవలే అడుగుపెట్టిన హీరోయిన్ నిధి అగర్వాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో ఆమెకు అభిమానులు ఆలయం నిర్మించారు. 
 
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమెకు అభిమానులు ఓ బహుమతిని పంపించారు. దీన్ని చూసి నిధి ఒకింత షాక్‌కు గురైంది. తనకు గుడి కట్టి, అందులో విగ్రహానికి అభిమానులు పాలభిషేకం చేశారని ఆమెనే స్వయంగా చెప్పింది. అసలు ఇది ఊహించనేలేదని, వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.
 
ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళనాడు రాష్ట్రంలో నిధి అగర్వాల్ విగ్రహానికి, కొందరు తెలుగు, తమిళ అభిమానులు పాలతో అభిషేకం చేశారు. ఆ ఫొటోల్ని కొందరు నిధికి సోషల్ మీడియాలో పంపించారు. దీంతో ఆమె షాకైంది. గతంలో తమిళంలో ఎమ్​జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు.
 
నిధి అగర్వాల్ తమిళంలో నటించిన తొలి రెండు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతికే విడుదలయ్యాయి. 'భూమి' ఓటీటీలో, 'ఈశ్వరన్' థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పలు చిత్రాలు చేసిన ఈ భామ.. ప్రస్తుతం పవన్​-క్రిష్ కాంబోలో తీస్తున్న ప్రాజెక్టులో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments