Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాకీ తూటాల పేలుళ్ళ మధ్య కాశ్మీర్‌లో `రోజ్‌ గార్డెన్` షూటింగ్

గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్‌`. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. చ‌ద‌ల‌వాడ తిరుప‌త

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:35 IST)
గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్‌`. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం క‌లిగి ఉంది. కాశ్మీర్‌లో అడుగుపెట్ట‌డానికే భ‌యం నెల‌కొన్న స‌మ‌యంలో ధైర్యంగా, సాహ‌సంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌టం విశేషం. 
 
ఈ చిత్రం గురించి దర్శ‌కుడు జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి) మాట్లాడుతూ... కాశ్మీర్ మొత్తం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న స‌మ‌యంలో నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాత్ర‌మే సాహ‌సంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్‌లో నిర్మిస్తుండ‌టం విశేషం. అలాగే కాశ్మీర్ ప్ర‌భుత్వంతో నిర్మాత‌ల‌కు ఉన్న అనుబంధం కార‌ణంతో దాదాపు 120 మంది యూనిట్ స‌భ్యుల‌తో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ప్ర‌భుత్వం అందిస్తున్న‌ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య స‌హకారంతో ఏ టెన్ష‌న్ లేకుండా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చిత్రీక‌ర‌ణ‌లో సైన్యానికి చెందిన ఆయుధాల‌నే ఉప‌యోగిస్తున్నట్టు చెప్పారు. 
 
చిత్ర స‌మ‌ర్ప‌కులు చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు మాట్లాడుతూ... ఇప్ప‌టికి 15 రోజుల నుంచి కాశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్‌లో 40 రోజ‌లు పాటు షూటింగ్ చేశాం. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ల‌వ్ అండ్ మ్యూజికల్ మూవీ. ఓ ప్రేమ జంట టెర్ర‌రిస్టుల కార‌ణంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొందనే పాయింట్‌ను కొత్త‌గా ఉంటుంది. ఇలాంటి క‌థ‌కు మంచి మ్యూజిక్ ఉండాల‌నే ఉద్దేశంతో ఆరు పాట‌ల్ని ముంబైలో భారీ ఎత్తున రికార్డ్ చేశాం. 
 
ప్ర‌ముఖ గాయ‌కులు ఉదిత్ నారాయ‌ణ్‌, జావేద్ అలీ, సాధ‌నా స‌ర్గ‌మ్‌, ఫ‌ల‌క్ ముచ్చ‌ల్‌, స్వ‌రూప్ ఖాన్ త‌దిత‌రుల‌తో పాట‌ల‌ను పాడించాం. ఈ సినిమాలో ముఖ్య‌మైన ప్రేమ గీతాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం రాయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. నాలుగు పాట‌ల‌తో స‌హా సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను కాశ్మీర్‌లో పూర్తి చేస్తాం. ఢిల్లీలో న‌వంబ‌ర్ 1 నుండి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. మిగిలిన పోర్ష‌న్ అంతా హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తాం సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments