Webdunia - Bharat's app for daily news and videos

Install App

1957నాటి యధార్థ కథతో హారర్ మూవీ "వసుధైక 1957"

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (18:48 IST)
అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై శ్రీమతి అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "వసుధైక 1957". హైదరాబాద్‌లో 1957లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా "బాల" అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 
 
బ్రహ్మాజీ, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, షాని ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా అరుణశ్రీ కంబైన్స్ అధినేత నిడమలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ.."దర్శకత్వశాఖలో పలు సంవత్సరాలు పని చేసిన "బాల"ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "వసుధైక 1957" చిత్రాన్ని నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. 
 
దర్శకుడు బాల మాట్లాడుతూ.. "1957లో ఓ ఐదేళ్ళ పాప జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం "వసుధైక 1957". సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలన్నీ కలగలిసిన ఈ హారర్ ఎంటర్ టైనర్ దర్శకుడిగా నాకు మంచి భవిష్యత్తునిస్తుందనే నమ్మకముంది" అన్నారు. బేబీ యోధ, కారుణ్య, పావని, శ్రీలత, సుభాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. ఎడిటర్: గోపీ సిందం, కెమెరా: తిరుమలరావు, మాటలు-పాటలు: భాషశ్రీ, సంగీతం: అమోఘ్ దేశపతి, కథాసహకారం-కో డైరెక్టర్: మహేష్ పెద్దబోయిన, సమర్పణ: శ్రీమతి అరుణ, నిర్మాత: నిడమలూరి శ్రీనివాసులు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాల.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments