Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ గర్ల్‌గా అనుష్ఠానం హీరోయిన్ మాధవి లత.. ఇకనైనా సినీ అవకాశాలు వస్తాయా?

ప్రస్తుత హీరోయిన్లలో అనేకమంది అందంతో పాటు అభినయం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి సినిమానే నచ్చావులే హీరోయిన్ ఎంచుకుంది. స్నేహితుడా, అరవింద్ 2, మిథునం వంటి సినిమాల్లో కథానాయికగా నటించిన మా

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (17:37 IST)
ప్రస్తుత హీరోయిన్లలో అనేకమంది అందంతో పాటు అభినయం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి సినిమానే నచ్చావులే హీరోయిన్ ఎంచుకుంది. స్నేహితుడా, అరవింద్ 2, మిథునం వంటి సినిమాల్లో కథానాయికగా నటించిన మాధవి లత ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో కాల్ గర్ల్ అవతారం ఎత్తింది. ఇది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. రీల్ లైఫ్‌లో ఓ పాత్రకు గాను అమ్మడు కాల్ గర్ల్‌గా నటించనుందని తెలిసింది. 
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..? గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత పాత్రలను ఎంచుకోవడమే హీరోయిన్ల ట్రెండ్‌గా మారింది. ఇలాంటి వాటిలో వేశ్య పాత్ర కూడా ఒకటి. ఇప్పటికే అనుష్క వంటి హీరోయిన్స్ వేశ్యగా నటించి మంచి గుర్తింపు సాధించారు. తాజాగా మాధవి లతకూడా కాల్ గర్ల్ పాత్రలో నటించింది. అదీ సినిమాలో కాదు షార్ట్ ఫిలిమ్‌లో. కెరీర్ ప్రారంభంలో వరుసగా హీరోయిన్‌గా నటించినా అమ్మడుకు హిట్స్ లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి కాస్త దూరమైంది. ప్రస్తుతం తిరిగి కెరీర్‌లో మంచి రోల్స్ చేయాలనుకున్న ఈ భామకు కాల్ గర్ల్ ఛాన్స్ వచ్చింది. 
 
'ఆన్ మోనాస్ బర్త్ డే'(On Mona's Birthday) అనే షార్ట్ ఫిలింలో కాల్ గర్ల్ పాత్రలో మాధవి లత నటించింది. బడ్జెట్ ఎక్కువగా పెట్టి తీసిన ఈ షార్ట్ ఫిలిమ్‌కు సునీల్ కశ్యప్ అందించాడు. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కే అనుష్ఠానం సినిమాలో మాధవి లత నటిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. గజల్ శ్రీనివాస్‌కు భార్యగా మాధవి లత కనిపించనుంది. షార్ట్ ఫిలిమ్, అనుష్ఠానం మహిమతో మాధవికి ఇకనైనా అవకాశాలు మెండుగా వస్తాయో లేదో వేచి చూడాలి. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments