Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌‍లో మరో విషాదం : నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ మృతి

Webdunia
గురువారం, 7 జులై 2022 (11:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం సంభవించింది. ఇప్పటికే దిగ్గజ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన మృతి నుంచి చిత్రపరిశ్రమ తేరుకోకముందే ఇపుడు నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 86 యేళ్లు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 
 
రాజేంద్రప్రసాద్‌ మరణంతో టాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మాధవి పిక్చర్స్‌’ సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి అనేక అణిముత్యాల్లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments