Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ కోరుకొండ స్క్రిప్ట్ : అందరికీ స్ఫూర్తినిచ్చే ''నాట్యం''!

Webdunia
సోమవారం, 9 మే 2016 (16:49 IST)
ప్రతి మనిషి జీవితంలో ఏవేవో లక్ష్యాలు ఉంటాయి. కొందరు అవి సాధించేందుకు శ్రమిస్తే.. మరికొందరు.. ఆ కోరికలను చంపుకుని బ్రతుకుతుంటారు? జీవితం అంటే మనకు నచ్చినట్టు జీవించడం, మన ఉనికిని ప్రపంచానికి తెలియచేయాలనే మంచి కథతో తెరకెక్కిన లఘు చిత్రం .. 'నాట్యం'. సంధ్య రాజు, అలేక్య పుంజాల, వాసుదేవ రావు, సంజయ్ నటించిన ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ తెరకెక్కించాడు. కీర్తిలాల్ డైమండ్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ప్రివ్యూ షో, ప్రెస్ మీట్ సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
అనంతరం కీర్తిలాల్ డైమండ్స్ ప్రతినిధి మధుసూద‌న్ మాట్లాడుతూ.. కీర్తి లాల్ డైమండ్స్ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో గోల్డ్, డైమాండ్ షో రూంలను స్థాపించింది. ఈ కంపెనీకి సొంతంగా డైమండ్ తయారు చేసే ప్లాంట్ కోయంబత్తూరులో ఉంది. అందులో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తారు. ఇక ఈ నాట్యం సినిమాకు సపోర్ట్ ఇవ్వడానికి కారణం.. మహిళలు తన జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యాన్ని.. కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని వదిలేసి.. జీవితంలో అసలైన ఆనందాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మంచి కథ. లక్ష్యం చేరుకోవాలంటే అడ్డంకులను అధిగమించాలని బాగా చెప్పారు. ఇంత మంచి చిత్రాన్ని తీసిన రేవంత్‌ని అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన సంధ్య అనుభవం ఉన్న నటిలా చక్కగా నటించింది అన్నారు. 
 
దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడానికి కారణం.. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం. ఇది నాకు విజిటింగ్ కార్డుగా ఉపయోగపడుతుందని తీసా. ఈ కథ అనుకున్నప్పుడు నిజంగా నాట్యం తెలిసిన నటి కోసం చాలా వెతికా. హైదరాబాద్‌లో చాలా డాన్స్ స్కూల్స్ తిరిగి, చివరగా సంధ్య గారిని చూసిన తరువాత ఈ పాత్రకు కరక్ట్ అని భావించి ఆమెతో మాట్లాడాను. కథ తనకు కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన నా టీం ఏంతో సపోర్ట్ అందించింది. ముఖ్యంగా డిఓపి శేఖర్, సిద్దార్థ్‌ల సపోర్ట్ మరచిపోలేనిది. ప్రశాంత్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 
 
అలేఖ్య మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సంధ్య‌రాజు ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ కాబట్టి చ‌క్క‌గా హావ‌భావాల‌ను ప‌లికించింది. నాట్యం మ‌న సంస్కృతికి సంబంధించింది. ఇలాంటి సినిమాల‌ను అందరూ ఆద‌రించాలి'' అని అన్నారు. 
 
హీరోయిన్ సంధ్యరాజు మాట్లాడుతూ .. డాన్సర్‌గా చాలా షోలు చేశాను కాని నటిగా ఇది నా తొలి చిత్రం. రేవంత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఈ రోజుల్లో చాలా మంది తమ లక్ష్యాలను ఏవేవో కారణాలతో వదిలేసి .. తృప్తిలేని జీవితం గడుపుతున్నారు. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించి మన గోల్‌ని రీచ్ అవ్వడమే జీవితం. రేవంత్ చాలా గొప్పగా తీశాడు. తప్పకుండా మాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments