Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ -5 : ఫస్ట్ వీక్‌లోనే ఆరుగురు ఔట్?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:48 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్ తెలుగు ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో... కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్ట‌కేల‌కే సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా లాంచ్ అయింది. 
 
ఈ సారి ఊహించ‌ని విధంగా 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోఅడుగుపెట్టారు. ఇక తొలి రోజు లోబో త‌న గుర‌క‌తో ఇంటి స‌భ్యులకు నిద్ర లేకుండా చేశాడు. మ‌ధ్య రాత్రి అంద‌రు లేచి లోబోనే చూస్తుండ‌గా, ఆయ‌న‌తో యాంకర్ రవి కొంత కామెడీ చేయించాడు. 
 
తొలి వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌నుకుంటున్నారో వారి ఫొటోల‌తో ఉన్న చెత్త బ్యాగులు తీసుకొని డ‌స్ట్ బిన్‌లో వేయాల‌ని చెప్పాడు. ఇ
 
లా ప్ర‌తి కంటెస్టెంట్ స‌రైన కార‌ణం చెప్పి ఇద్ద‌రి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయాల్సిందిగా కోరాడు. అయితే హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్క‌రోజే కావ‌డంతో నామినేట్ చేయడానికి నానా కార‌ణాలు వెతుక్కోవ‌ల్సి వ‌చ్చింది.
 
ముందుగా సింగర్‌ శ్రీరామచంద్ర.. మానస్‌, జెస్సీలను నామినేట్‌ చేశాడు. అనంత‌రం సరయూ.. ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్‌ మాస్టర్‌ను ; జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్‌, జెస్సీలను నామినేట్‌ చేశారు. విశ్వ.. జశ్వంత్ (జెస్సీ), మానస్‌లని; అనీ మాస్టర్.. సిరి, జెస్సీలను; జెస్సీ .. విశ్వ, హమీదాలను; జెస్సీ .. విశ్వ, హమీదాలను; జెస్సీ .. విశ్వ, హమీదాలను; జెస్సీ .. విశ్వ, హమీదాలను; హమీదా.. లహరి, జెస్సీలను నామినేట్ చేశారు.
 
ఇక షణ్ముక్ జస్వంత్.. సన్నీ, లోబోలను; సన్నీ.. షణ్ముక్, సరయులను; ప్రియాంక.. షణ్ముఖ్, హమీదలను ; ప్రియాంక.. షణ్ముఖ్, హమీదలను ; ప్రియ.. సిరి, కాజల్‌‌లను; లోబో.. ప్రియ, యాంకర్ రవిలను; మానస్.. విశ్వ, సరయులను; సిరి.. హమీదా, ప్రియలను; కాజల్.. సరయు, ఉమలను; లహరి.. హమిదా, కాజల్‌లను నామినేట్ చేసింది.
 
ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో కొంద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌గా, కొంద‌రు త‌మ‌పై వేసిన ఆరోప‌ణ‌లు ఖండించారు. జెస్సీ, కాజ‌ల్, హమీదా వంటి వారు ఎమోష‌న‌ల్ అయి క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక చివ‌రిగా ఫ‌స్ట్ వీక్‌లో ఎక్కువ ఓట్లు వ‌చ్చిన రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు నామినేష‌న్‌లో ఉన్నారు. ఇందులో నుండి ఒకరు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments