Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం పార్టీకి గ్లామర్... బీజేపీలో చేరిన మాధవీలత...

భారతీయ జనతా పార్టీకి కాస్త గ్లామర్ వచ్చింది. టాలీవుడ్ సినీ నటి మాధవీలత కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంది. కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (10:06 IST)
భారతీయ జనతా పార్టీకి కాస్త గ్లామర్ వచ్చింది. టాలీవుడ్ సినీ నటి మాధవీలత కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంది. కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు.
 
నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆమె ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గడ్కరీ ఆమెను సాదరంగా ఆహ్వానించి బీజేపీ కండువ కప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన నచ్చి ఆ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. 
 
అయితే, నటి మాధవీలత బీజేపీలో చేరటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నా కూడా చేసింది. దీంతో ఆమె జనసేనలో జాయిన్ అవుతారనే వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా ఈ కళాకారిణి బీజేపీలో చేరటం విశేషం. 
 
ఇకపోతే, నటి మాధవీలతతోపాటు కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వైకుంఠం, కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత అమర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ చేరికలతో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతమైనందనీ, ముఖ్యంగా, కీలక నేతలు పార్టీలో చేరటం శుభపరిణామమని కేంద్రమంత్రి గడ్కారీ అన్నారు. అదేసమయంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని.. పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments