Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రవింద, సలోని ఛాన్సును వదులుకున్నా.. ఇప్పుడు ఖాళీగా వున్నా?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (16:29 IST)
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో కలిపి దాదాపు 40 సినిమాల వరకు నటించింది అర్చన. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు తొలి కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అయినప్పటికీ ఈ మేరకు రావలసిన గుర్తింపు మాత్రం లభించలేదు. 
 
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఏ అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం చాలా కష్టం. అంతే కాదు అలా వచ్చిన అవకాశం తమను ఎక్కడికి తీసుకు వెళుతుందో కూడా ఎవరూ ఊహించలేరు. ఒకసారి ఒక అవకాశాన్ని వదులుకున్నారు అంటే ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి బాధనే ప్రస్తుతం అర్చన కూడా పడుతోంది. 
 
ఒకప్పుడు ఆమె చేసిన తప్పు వల్ల తాజాగా చాలా ఫీల్ అవుతుంది. మగధీర సినిమాలో మిత్రవింద పాత్రకు మొదట రాజమౌళి తనకు అవకాశం ఇచ్చారని, ఆ తరువాత మర్యాద రామన్న సినిమాలో సలోని పాత్ర కోసం కూడా ముందుగా తనను అడిగారని తెలిపింది అర్చన. 
 
అప్పుడు తాను బిజీగా ఉండడంతో వీటిని రిజెక్ట్ చేసిందట. అప్పటికే తాను నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా బాగా హిట్ అయ్యి.. తన జర్నీ బాగా కొనసాగుతుంది అని చెప్పుకొచ్చింది. మొదట్లో జీవితం బాగానే ఉన్నా ఆ తర్వాత లీడ్రోల్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 
 
సైడ్ రోల్ చేస్తే అవి హిట్ అయ్యాయని అర్చన తెలిపింది. అప్పుడే అనిపించింది రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేశాను అని అంటూ ఫీల్ అవుతూ ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకొంది అర్చన. ఎన్నో అవకాశాలను అందుకున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక వదులుకోవడంతో ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్నాను అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments