Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌పై వ్యాఖ్యలు.. అర్షద్ వార్సీకి సూపర్ పబ్లిసిటీ : హీరో నాని కామెంట్స్

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:07 IST)
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన వివాదాస్పద వాఖ్యలపై మరో టాలీవుడ్ హీరో నాని ఇటీవల కామెంట్స్‌ చేశారు. ప్రభాస్‌పై విమర్శలు చేయడం వల్ల అర్షద్ వార్సీకి గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ లభించిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా నాని వర్సెస్ అర్షద్ వర్సీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. హీరో నాని కంటే అర్షద్ మంచి నటుడు అంటూ, అర్షద్ సినిమా హయ్యెస్ట్ వసూళ్ల కంటే నాని రెమ్యూనిరేషన్ ఎక్కువంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్స్ చెస్తున్నారు. 
 
ఇక "సరిపోదా శనివారం" హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌ కోసం ముంబైకు వెళ్లిన నాని.. అర్షద్‌పై తాను చేసిన కామెంట్స్‌కు చింతిస్తున్నట్లు మిడ్ డే‌కు తెలిపారు. అర్షద్‌ వార్షి చాలా గొప్ప నటుడని ఉత్తరాది లేదా దక్షిణాది అని కాదు భారతదేశం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుందని అన్నాడు. మున్నాభాయ్ సినిమాతో అర్షద్ దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యాడని నాని గుర్తుచేశారు. 
 
అలాగే నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తనకు అర్థమైందని.. పదాల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని. అలా చేయకపోవడం వల్ల అటు అర్షద్ ఇటు తాను బాధితులమయ్యామని నాని అన్నారు. ప్రభాస్‌ గురించి ఆయన చేసిన కామెంట్స్‌ నేనూ విన్నాను. అర్షద్‌ని ఉద్దేశించి నేను చేసిన కామెంట్స్‌ ఏవిధంగా వైరల్‌గా మారాయో, అర్షద్ కామెంట్స్‌ కూడా అలానే వైరల్‌గా మారాయి. తన వ్యాఖ్యలు మరోవిధంగా ప్రజల్లోకి వెళ్లాయని నాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments