హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

డీవీ
సోమవారం, 2 డిశెంబరు 2024 (07:11 IST)
Pushpa 2 new
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఈనెల 5న సినిమా థియేటర్లలో విడుదలకాబోతుంది. ఇప్పటికే దేశంలో పలుచోట్ల పుష్ప 2  టీజర్, ట్రైలర్ ఈవెంట్ లు నిర్వహించారు. పాట్నా, చెన్నై, కేరళ, ముంబై వంటి చోట్ల నిర్వహించిన ఈవెంట్లకు భారీ స్పందన వచ్చింది. ఎక్కడ ఈవెంట్ జరిగినా చిత్ర దర్శకుడు సుకుమార్ మాత్రం హాజరు కాలేదు. తను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడని అల్లు అర్జున్ వెల్లడించారు.
 
తాజాగా నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు యూసుఫ్ గూడా స్టేడియం అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహ ఏర్పాట్లకు సిద్ధం చేశారు. ఇందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం ప్రేక్షకులకు, ప్రజలకు ట్రాఫిక్ సూచనలు చేసింది. అమీర్ పేట మైత్రీవనం నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళే వారంతా యూసుఫ్ గూడా బస్తీ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా వెళ్ళాలి,. అలాగే జూబ్లీహిట్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వెహికల్ కూడా అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియో మీదుగా శ్రీనగర్ కాలనీవైపు వెళ్ళాల్సిందిగా పోలీసు కమీషనర్ ఓ లెటర్ ను మీడియాకు విడుదల చేశారు. ఇక యూసుఫ్ గూడ కు రావాలనుకునేవారు కమలాపురి కాలనీవైపుగా చుట్టూరా తిరిగిరావాలి. అభిమానులు తమ వెహికల్ పార్కింగ్ ను యూసుఫ్ గూడలోని మెహబూబ్ ఫంక్షన్ హాల్, జానకమ్మ తోటలో పార్కింగ్ చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments