Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జాంభి రెడ్డి" టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (21:30 IST)
'ఓబేబి' ఫేమ్ తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న చిత్రం "జాంభి రెడ్డి". ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంఛ్ కార్యక్రమం డిసెంబరు 5న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. స్టన్నింగ్ బ్యూటీ సమంత, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరవగా ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, బెక్కం వేణుగోపాల్, వాకాడ అప్పారావు, నటుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందిని రెడ్డి, విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా "జాంభి రెడ్డి" పోస్టర్‌ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయగా టీజర్‌ని స్టన్నింగ్ బ్యూటీ సమంత విడుదల చేసారు.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో... హీరో తేజ సజ్జ, హీరోయిన్స్ ఆనంది, దక్ష నగార్కర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, కెమెరామెన్ అనిత్ మాదాడి పాల్గొన్నారు.
 
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రశాంత్ వర్మ డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తాడు. తన ఫస్ట్ సినిమాతోనే నేషనల్ ఆవార్డ్ సంపాదించుకున్నాడు. టీజర్ చాలా థ్రిల్లింగ్ గా, ఉత్కంఠ భరితంగా ఉంది. ఇంద్ర మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు తేజ. ఫస్ట్ టైం జాంభి రెడ్డితో హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
జెమిని కిరణ్ మాట్లాడుతూ.. 'వైవిధ్యమైన కథలతో ప్రశాంత్ వర్మ సినిమాలు తీస్తాడు. టీజర్ చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు న్యూ ఐడియాస్‌తో స్టోరీస్ చెప్పే వర్మ ఈ చిత్రాన్ని అదే లెవెల్‌లో తీసాడని అర్థం అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
 
నిర్మాత వాకాడ అప్పారావు మాట్లాడుతూ, 'జాంభి రెడ్డి టీజర్ చాలా అద్భుతంగా ఉంది. హీరోగా తేజకు మంచి లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ న్యూ జానర్‌లో ఈ సినిమా తీశాడు. ఆడియెన్స్ అందరూ ఈ కనెమ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు. 
 
నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..' ఈ చిత్ర నిర్మాత రాజ్ శేఖర్ వర్మ దుబాయిలో ఉంటాడు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అతను కాల్ చేసి ఈ జాంభి రెడ్డి సినిమా తీసాను. టీజర్ లాంచికి రావాలని చెప్పాడు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా డిఫరెంట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. ప్రశాంత్ వర్మ తొలి సినిమాతో 'ఆ' తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సస్పెన్స్, థ్రిల్లర్స్, ఆఫస్టాలిక్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. ఈ సినిమాతో కొత్త తరహా సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నారు.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'ప్రశాంత్ వర్మ ఈ కథ నాకు నెరేట్ చేసినప్పుడు ఇలాంటి సినిమా నేను తీయగలనా అని చాలా భయపడ్డాను. తేజని నేనె ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. కుదరలేదు. జాంభి రెడ్డి టీజర్ చూసాక నేను ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. ఆడియెన్స్ అందర్నీ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అన్నారు. 
 
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, 'తేజ, ప్రశాంత్ వర్మ ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా ఎప్పుడు చూద్దామా అని ఎక్సయిటెడ్‌గా ఫీలయ్యాను. టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో ఇంకా చాలా విషయం ఉంది. ఈ చిత్రం ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్నారు. 
 
స్టన్నింగ్ బ్యూటీ సమంత మాట్లాడుతూ, 'జాంభి రెడ్డి టీజర్ అదిరిపోయింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. విజువల్స్, మేకింగ్ వాల్యూస్ సూపర్బ్‌గా ఉన్నాయి. నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నాను. కానీ నేను ఎక్సపెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. తేజకీ సినిమా అంటే ప్రాణం. ఎప్పుడు సినిమాకోసమే తపిస్తుంటాడు. నేను కూడా సీన్ బాగా చేశానా లేదా అని టెన్షన్ పడుతుంటాను. తేజకుడా అలాగే ఫీలవుతాడు. ఇక ప్రశాంత్ నాకు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ కావాలని హీరోగా తేజకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తున్నాను.. అన్నారు. 
 
చిత్ర కథనాయకి దక్ష మాట్లాడుతూ.. 'హీరోయిన్‌గా నాకు సమంత ఇన్స్పిరేషన్. మా చిత్రం టీజర్ సమంత రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు బ్యానర్లో ఆల్రెడీ వర్క్ చేసాను. ఆయన కూడా వచ్చి పోస్టర్ లాంఛ్ చేసినందుకు థాంక్స్. ప్రశాంత్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఎలాగైనా ఈ మూవీ చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. ఒక మంచి రోల్ జాంభి రెడ్డిలో చేసాను. సినిమా అందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. 
 
మరో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ, 'చాలా రోజుల గ్యాప్ తర్వాత జాంభి రెడ్డిలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేసాను. ఈ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించించింది. నిర్మాత రాజ్ శేఖర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించారు. లాక్డౌన్ సమయంలో కూడా యూనిట్ అంతా ఈ చిత్రానికి చాలా హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేశారు. పెద్ద ఆర్టిస్టులు అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో ఆడియెన్స్‌ బిగ్ ఎంటర్‌టైనింగ్ మూవీ చూడబోతున్నారు అన్నారు. 
 
చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, 'పిలవగానే మా టీజర్ లాంఛ్‌కి వచ్చిన అతిధులందరికి నా థాంక్స్. ఈ సినిమాని కరోనాకు ముందు కొంత పార్ట్ షూట్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ ఉన్న పార్ట్‌ని పూర్తి చేసాం. కరోన టైంలో ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. ఆర్టిస్టులు, టెక్నీస్జియన్స్ అందరూ నన్ను సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేస్తూ ఈ చిత్రానికి వర్క్ చేశారు. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. భారీ బడ్జెట్‌తో కూడుకున్న హై కాన్సెప్ట్ బిగ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఇది. హాలీవుడ్‌లో జాంబీస్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. తెలుగులో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాను. 
 
తెలివిగా తీసాను అని చెప్పాను కానీ ఒక కొత్త ఫిల్మ్ చూశాం అని ప్రేక్షకులు థ్రిల్ అవుతారని గ్యారెంటీగా చెప్పగలను. ఔట్ ఫుట్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ జాంభి రెడ్డి లెవెల్-2 తీయాలని ఉంది. అనేక ట్విస్టులతో సప్రైజ్‌గా ఉంటుంది. అ సినిమాకి బెస్ట్ మెకప్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమా చూశాక అందరూ అప్రిషియేట్ చేస్తారు. నిర్మాత రాజ్ శేఖర్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దేనికీ వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ, నేను చాలా సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాం. ఈ పర్టిక్యులర్ ఫిల్మ్‌కి మా ఇద్దరి వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది. తేజతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చారు. 
 
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, 'బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా మా ఈ కొత్త సినిమాని సపోర్ట్ చేయడానికు వచ్చిన దిల్ రాజుకి థాంక్స్. అలాగే మేము ఏది చెయ్యాలన్న కరెక్ట్ డెసిషన్ కోసం కిరణ్‌ని అప్రోచ్ అయి సలహాలు తీసుకుంటాం. కొత్త తరహా సినిమాలు కోరుకునే ఆడియెన్స్‌కి మా జాంభి రెడ్డి ఒక విజువల్ ఫీస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. 
 
ఫస్ట్ ఈ సినిమా ఐడియా సమంత గారికి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్‌గా ఫీలయ్యాను. అప్పట్నుంచి మాతో ట్రావెల్ అవుతూ.. సినిమా బాగా వస్తుందా.. లేదా అని అడిగి తెలుసుకునేవారు. మా సినిమా ప్రమోషన్‌కి రావాలని అడగ్గానే డేట్ టైం చెప్పు వస్తానని చెప్పారు. అలాగే ఇప్పుడు వచ్చి మా టీజర్ లాంచ్ చేసిన సమంతకు ధన్యవాదాలు అని చెప్పకొచ్చారు. 
 
తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ జంటగా నటించిన ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వి రాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, కెమెరా: అనిత్ మాదాడి, ఎడిటర్: సాయిబాబు తలారి, కొరియోగ్రాఫర్స్: విజయ్, యస్వంత్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, కాస్ట్యూమ్స్ డిజైనర్: ప్రసన్న దంతులూరి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఏక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమచ్చ, ప్రభ చింతలపాటి, దర్శకత్వం: ప్రశాంత వర్మ, నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments