స్కిన్ షో ఏదీ... లేకుండా జనం చూస్తారా... దర్శకుడి అనుభవం...
సినిమా తీశాక.. దాన్ని మార్కెట్ చేయాలంటే.. డిస్ట్రిబ్యూటర్లు కావాలి. కానీ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొత్త దర్శకనిర్మాతల సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు రావడంలేదు. నేను తీసిన సినిమాను కొంతమందికి చూపించాను. అందరూ.. ఏం బాగుంది.. ఎలా ఆడుతుంది. హీరోయిన
సినిమా తీశాక.. దాన్ని మార్కెట్ చేయాలంటే.. డిస్ట్రిబ్యూటర్లు కావాలి. కానీ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొత్త దర్శకనిర్మాతల సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు రావడంలేదు. నేను తీసిన సినిమాను కొంతమందికి చూపించాను. అందరూ.. ఏం బాగుంది.. ఎలా ఆడుతుంది. హీరోయిన్ స్కిన్ షో ఏది? చీర కట్టుకుంటే సినిమా ఆడుతుందా? అంటూ నా ముందే.. నిర్మాతను మందలించారు.
తర్వాత వారంతా వెళ్ళిపోయారు.. అలాంటి సమయంలో... రాజ్ కందుకూరి ధైర్యంగా నిలబడి.. దర్శకుడుగా మీరు ఫర్‌ఫెక్ట్. స్కిన్ షో లేకపోతే సినిమాలు చూడరా.. ఆలస్యమైనా.. సినిమాను విడుదల చేస్తామని.. నాకు భరోసా ఇచ్చారు. అనుకున్నట్లుగా.. సినిమాను విడుదల చేశామని.. ఊహించని రెస్పాన్స్ వస్తుందనీ... దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. ఇదంతా పెండ్లిచూపులు చిత్రం గురించి.. తనకు జరిగిన అనుభవాన్ని ఇలా వ్యక్తం చేశారు.