Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీడా కోలా చిత్రంలో లోకల్ డాన్‌గా తరుణ్ భాస్కర్‌

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (18:39 IST)
Tarun Bhaskar- lokal don
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ 'కీడా కోలా' టీజర్ విడుదలైంది. మేకర్స్ గతంలో హ్యుమరస్ పోస్టర్ల ద్వారా సినిమాలోని 8 ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.
 
ఒక కోలా బాటిల్‌ లో ఎదో కదులుతూ వుంటుంది. అది ఏంటని బ్రహ్మానందం అడిగితే? చైతన్యరావు ద్రాక్ష అని చెబుతాడు. ఇద్దరి మధ్య సెటైరికల్ పంచ్‌లతో టీజర్‌ హిలేరియస్ గా మొదలౌతుంది. తర్వాత గ్యాంగ్ ఆఫ్ మిస్‌ఫిట్స్ యాక్షన్ లోకి దిగడం ఇంకా ఆసక్తికరంగా వుంది. టీజర్ సినిమాలోని పాత్రలు, వారి వరల్డ్ ని పరిచయం చేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంటూ తర్వాత వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ పై క్యురియాసిటీని పెంచింది.  
 
టీజర్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్‌ లోకల్ డాన్‌గా కనిపించడం సర్ ప్రైజ్ చేసింది. చైతన్య రావు మాదాడి, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ ఇతర ముఖ్య తారాగణం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
 
కీడా కోలా విజి సైన్మా మొదటి ప్రొడక్షన్.  కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్. తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ రాశారు.
 
కీడా కోలా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
 
తారాగణం: బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments