Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టిన 'గీత గోవిందం'

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్య

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (16:18 IST)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడు.
 
అయితే, ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళుతున్నట్టు ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'గీత గోవిందం' ఓవర్సీస్‌లో బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ నటించిన చిత్రం "గోల్డ్‌"తోపాటు మరో చిత్రం "సత్యమేవ జయతే" చిత్రాల కలెక్షన్లను బీట్ చేసిందని చెప్పారు. 
 
ముఖ్యంగా, ఆస్ట్రేలియాలో 'గోల్డ్', 'సత్యమేవ జయతే' చిత్రాలు 192,306 డాలర్లు (రూ.కోటి 34 లక్షలకుపైగా) రాబట్టగా.. తెలుగు సినిమా 'గీత గోవిందం' వాటిని అధిగమిస్తూ 202,266(కోటి 40 లక్షలకుపైగా)డాలర్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గీత గోవిందం యూఎస్‌లో 1.5 మిలియన్లు వసూలు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

RGV : రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నుంచి ఉపశమనం - 6వారాల పాటు రిలీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments