Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

సెల్వి
బుధవారం, 23 జులై 2025 (14:59 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
బాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్‌గా రాణించిన తను తనూ శ్రీ దత్త మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల ఆమె సినిమాలకు దూరంగా వుంటోంది. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‪‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
 
 
ఈ మీటూ మూమెంట్‌ సౌత్‌కి కూడా విస్తరించింది. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు ముందుకు వచ్చి తాము కూడా వేధింపులకు గురైనట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇలా తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తను శ్రీ దత్తా తెలిపింది. తనని ఇంట్లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ప్లీజ్‌ ఎవరైనా సాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమె తన బాధలు చెబుతూ కన్నీరు మున్నీరయ్యింది. ఆరేళ్లుగా ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తెలిపింది. 
 
ఇందులో తను శ్రీ దత్తా చెబుతూ, "నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏమీ మాట్లాడలేకపోతున్నా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. పోలీసులకు ఫోన్ చేశాను, వారు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. 
 
బహుశా రేపో ఎల్లుండో పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. భద్రత లేకుండా పోయింది. పనిమనిషిని కూడా పెట్టుకోలేకపోయాను. గతంలో వచ్చిన పనివాళ్లు వస్తువులు దొంగిలించారు. అంతా నేనే చూసుకోవాల్సి వస్తోంది" అని తెలిపింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

ఐబొమ్మ రవి గుట్టును భార్య విప్పలేదు.. పోలీసుల పంపిన మెయిల్స్‌కు స్పందించి వలలో చిక్కాడు...

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Male Nurse: మహిళా వైద్యులు, పీజీ మెడికోలు బట్టలు మార్చే వీడియోలు తీసిన మేల్ నర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం