Webdunia - Bharat's app for daily news and videos

Install App

తంగలాన్ లో పీరియాడిక్ గెటప్ లో చియాన్ విక్రమ్ - రిలీజ్ డేట్ ఫిక్స్

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (10:11 IST)
Tangalan
చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా "తంగలాన్". ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
 
"తంగలాన్" సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "తంగలాన్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన "తంగలాన్" సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.

నటీనటులు - చియాన్ విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్, వైజాగ్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

Revanth Reddy: రాఖీ సావంత్‌తో కేసీఆర్‌ను పోల్చిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments