తండేల్, పుష్ప 2, గేమ్ చేంజ‌ర్ పోటీగా రాబోతున్నాయి - తాజా అప్ డేట్

డీవీ
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:26 IST)
pupshpa,tandel,gamchanger
ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారని నిర్మాత బ‌న్నీ వాస్‌ అన్నారు. నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీ వాస్ పలు విశేషాలను తెలియజేశారు..
 
 - ఆయ్ సినిమా షోస్ పెంచాల‌ని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. మేం కూడా పెంచుతున్నాం. డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి.
 
- నా లైఫ్‌లో గ్రేట్ రిలేష‌న్స్ ఉన్నాయంటే ఫ్రెండ్ షిప్. నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే నా స్నేహితులే కార‌ణం. బ‌న్నీగార‌నే కాదు. చాలా మంది స్నేహితులు ఎస్‌.కె.ఎన్‌, మారుతి వంటి వారున్నారు. అలాంటి నాకు ఫ్రెండ్ షిప్ క‌థ వ‌చ్చిప్పుడు నేను క‌నెక్ట్ కాకుండా ఎందుకుంటాను.
 
- చిన్న సినిమా తీసి పెద్ద స‌క్సెస్ కొట్టిన‌ప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది. క‌థ‌, జోన‌ర్‌ను బ‌ట్టి సినిమా చేయాలి.. సినిమా పెద్ద‌దైనా, చిన్న‌దైనా రెంటింటికి ప‌డే క‌ష్ట‌మొక‌టే.
 
- తండేల్ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్‌లో రిలీజ్ అనుకున్నాం. అయితే అదే నెల‌లో పుష్ప 2 వ‌స్తుంది. గేమ్ చేంజ‌ర్ రిలీజ్‌ను కూడా అనుకుంటున్నారు. తండేల్ సినిమాకు సంబంధించి సీజీ వ‌ర్క్ మీద ఎక్కువ ఫోక‌స్ చేయాల్సి ఉంది. అవ‌న్నీ చూసుకునే ద‌స‌రా త‌ర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ వ‌స్తుంద‌నుకుంటున్నాను అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments