Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని యువ హీరోల జీవితాల్ని అల్లు అరవింద్ నాశనం చేస్తున్నాడా? తమ్మారెడ్డి ఫైర్

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:13 IST)
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్ జీవితాలను నాశనం చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేసి ఓ ఇద్దరు డైరెక్టర్లను పెట్టి వాళ్లతో సినిమాలు తీస్తున్నారనీ అందుకే అఖిల్, నాగ చైతన్యలు సరైన హిట్ కొట్టలేకపోతున్నారనీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. 
 
ఈ వార్తలపై తమ్మారెడ్డి స్పందిస్తూ, అల్లు అరవింద్ వీళ్ల జీవితాలను నాశనం చేయడానికి ప్లాన్ చేయడం ఏంటయ్యా బాబూ.. ఆయనకేం పనిలేదా లేక అల్లు అరవింద్ ఏమైనా పిచ్చోడనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయ్యాడు. ‘ఒకవేళ వాళ్ల జీవితాలను నాశనం చేయాలని అనుకుంటే.. వీళ్లూ పెద్ద హీరోలే కదా అలాంటప్పుడు ఎందుకు చేస్తారు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి క్యాప్షన్‌లు పెట్టే వాళ్లకే నాగచైతన్య, అఖిల్ జీవితం నాశనం అయిపోతుందని తెలిసినప్పుడు.. ఆ మాత్రం వాళ్లకు తెలియదా... అల్లు అరవింద్ చేతుల్లో వీళ్ల జీవితం ఎందుకు పెడతారు అంటూ ప్రశ్నించారు. 
 
గీతా ఆర్ట్స్ పెద్ద బ్యానర్ కాబట్టి అందులో చేయడానికి ఒప్పకున్నారేమో.. పనిచేస్తారేమో.. డైరెక్టర్, కథ నచ్చితే చేస్తే చేస్తారు లేదంటే లేదు. వాళ్లేం చిన్న పిల్లలు కాదూ.. అరవింద్ పిచ్చోడేం కాదు. వాళ్లపై సినిమా తీసి ఫ్లాప్ ఇచ్చి డబ్బులు పోగొట్టుకోవడానికి. సంపాదన కోసమే సినిమా తీస్తారాయన. ఆయనైనా మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు అయినా పక్కా ప్రొఫెషనల్స్.

రూపాయి పోగొట్టుకోవడానికి, ఎవర్నో నాశనం చేయడానికి ప్రయత్నించే మనుషులైతే కాదు వాళ్లు. రూపాయిని పది రూపాయిలు చేస్తారు. అలాంటి వాళ్ల గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి వాళ్లకు వాళ్లకు మధ్య లేనిపోని అపార్థాలను కల్పించవద్దని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments