Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ.. సి.కళ్యాణ్ నిర్మాత..

నందమూరి హీరో, నటసింహ బాలకృష్ణ హీరోగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సూపర్

Webdunia
బుధవారం, 10 మే 2017 (17:03 IST)
నందమూరి హీరో, నటసింహ బాలకృష్ణ హీరోగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నరసింహ వంటి హిట్ సినిమాను రూపొందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య తన 102వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేఎస్ రవికుమార్‌తో బాలయ్య చేసే తొలి సినిమా కూడా ఇదే. 
 
ఈ సినిమా గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. బాలయ్య హీరోగా నరసింహ డైరక్టర్ కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటుందన్నారు. ఎం. రత్నం ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా మరో సంచలనం అవుతుందన్నారు. జూలై  10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన  పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని సి. కళ్యాణ్ వెల్లడించారు. 
 
ఇకపోతే.. కేఎస్ రవికుమార్ సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో దశావతారం చిత్రానికి దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌లో టాప్ హీరోలతో సినిమాలు రూపొందించిన కేఎస్ రవికుమార్ బాలయ్యతో 151వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక బాలయ్య 151వ సినిమాను పూరీ జగన్నాథ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించిన శ్రియానే కథానాయికగా నటించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments