Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టమొచ్చినట్లు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారులు కాదు : నయనతార

తమను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారిణులు కాదని హీరోయిన్ నయనతార అన్నారు. ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:51 IST)
తమను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారిణులు కాదని హీరోయిన్ నయనతార అన్నారు. ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి కదా అని తమిళ డైరక్టర్ సూరజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్లు నయనతార, తమన్నాలు మండిపడ్డారు. 
 
దర్శకుడు సూరజ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్లు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కథానుగుణంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తామే తప్ప ప్రేక్షకులు కూడా తమ నుంచి అలాంటిదేమీ కోరుకోరని నయనతార చెప్పింది. సూరజ్ కుటుంబం నుంచి ఎవరైనా హీరోయిన్ అయ్యి ఉంటే అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తాడా అని ప్రశ్నించింది.
 
అలాగే, హీరోయిన్ తమన్నా కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. తాము యాక్టర్లమని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఉన్నామని తమన్నా చెప్పింది. తాను దక్షిణాది పరిశ్రమలో 11 సంవత్సరాలుగా నటిస్తున్నాని, తనకు ఏ కాస్ట్యూమ్స్ కంఫర్ట్‌గా అనిపిస్తే వాటిని ధరిస్తానని తెలిపింది. అయినా మన దేశంలో ఆడవాళ్లపై అసభ్యంగా కామెంట్ చేయడం అలవాటైపోయిందని ఘాటుగా స్పందించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments