Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు స్వర్గంలో మరో సింహాసనం ఎదురుచూస్తోంది.. త్రిష ట్వీట్

హీరోయిన్‌గా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవ కథానాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సీని రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (10:13 IST)
హీరోయిన్‌గా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవ కథానాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సీని రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. గౌతం వాసు దేవ్ మీనన్, రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు.
 
స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అనీ సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. 
 
తమిళనాడుకేకాదు... యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్‌లో అజిత్ కుమార్ కూడా అమ్మ మృతికి సంతాపం ప్రకటించారు. జీవితంలోని అనేక యుద్ధాల్లో పోరాడాతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయం ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు. 
 
అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలిలత ఒకరని శ్రుతిహాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు ఒక సాహసోపేతమని మహిళా నాయకురాలని కోల్పోయిందని,ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments