Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

దేవి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (18:10 IST)
Taman, Nara Bhuvaneshwari
'తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. అడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది.  
 
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. జెనిటిక్ డిసార్డర్ తలసేమియా తో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి వున్న వారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్త మార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయి. తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారు. 
 
తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు. ఆయనకి ఎప్పుడు దేవుని ఆశీస్సులు వుంటాయి. ప్రతి ఒక్కరు తెలుగు తల్లికి రుణం తీర్చుకోవాలి. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు...ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవ కె ఉపయోగపడుతుంది, బుక్ మై షో లో టికెట్స్ అవైల్ బుల్ గా వుంటాయి. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుక్కొని కుటుంబ సమేతంగా వచ్చి ఈ కారక్య్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు
 
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. చాలా మంచి ఆలోచనతో మొదలైన కార్యక్రమం ఇది. ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది. నారా భువనేశ్వరి గారి ఆలోచన చాలా గొప్పది. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే నేను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పాను. భువనేశ్వరి గారు నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారు. టికెట్ పై పెట్టె ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుంది. ఈ షో చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ షోని సూపర్ సక్సెస్ చేసే బాధ్యత మన అందరిపై వుంది. ఇది బిగ్గెస్ట్ షో కాబోతోంది' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

భర్తలేని జీవితం.. ఇక జీవించడం కష్టం.. నదిలో బిడ్డల్ని పారవేసింది.. ఆపై ఆమె కూడా?

నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాజీవ్‌రెడ్డి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments