Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా షూటింగ్ అక్క‌డ జ‌రుగుతోందా..? అస‌లు సీక్రెట్ ఇదే..!

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (21:29 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ‌చ‌ర‌ణ్ దాదాపు 200 కోట్ల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందాల తార న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం పాండిచ్చేరిలో జ‌రుగుతోంది. 
 
పాండిచ్చేరిలో షూటింగ్ చేయ‌డడం వెన‌క ఓ సీక్రెట్ ఉంది. అది ఏంటంటే... బ్రిటిష్ కాలానికి చెందిన కొన్ని భవనాలు అక్కడ ఉన్నాయ‌ట‌. ఆ నేపథ్యంలో వచ్చే కొన్ని కీల‌క‌ సన్నివేశాలను అక్కడే ప్లాన్ చేశారట. నరసింహా రెడ్డి బృందానికి .. ఆంగ్లేయ అధికారులకు మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. గ‌త సంవ‌త్స‌రం చిరంజీవి పుట్టిన‌రోజు నాడు టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఈ సంవ‌త్స‌రం కూడా చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ఇటీవ‌ల సైరా ద‌స‌రాకి రావ‌డం లేదు. సంక్రాంతికి రానుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో సైరా రిలీజ్ డేట్ పై ఏర్ప‌డిన క‌న్ ఫ్యూజ‌న్ కి క్లారిటీ ఇస్తూ...సైరా రిలీజ్ డేట్ ను కూడా అదే రోజున అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments