Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎఫ్2'తో గాడిలో పడిన తమన్నా.. 'సైరా'తో కేక

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (12:12 IST)
టాలీవుడ్ మిల్కీబ్యూటీగా పేరుగాంచిన తమన్నాకు ఇపుడు మళ్లీ సినీ అవకాశాలు వరుసబెడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్‌లు నటించిన "ఎఫ్-2" చిత్రానికి ముందు ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో ఆమె తెలుగు వెండితెరకు దూరమైనట్టేనని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ సమయంలో వచ్చిన "ఎఫ్-2" తమన్నా కెరీర్‌ను గాడిలో పెట్టింది. తాజాగా 'సైరా' చిత్రం ఘన విజయంతో తమన్నాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
నిజానికి తమన్నా.. ఇటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపుపొందింది. అలాగే, బాలీవుడ్‌లోనూ తన జోరు చూపించడానికి ప్రయత్నించిందికానీ కుదరలేదు. బాలీవుడ్ సంగతి అలా ఉంచితే తెలుగు.. తమిళ భాషల్లోనూ కొత్త కథనాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలోనే వచ్చిన 'ఎఫ్ 2' ఆమెకి ఎంతో రిలీఫ్‌ను ఇచ్చింది. 'సైరా' వంటి భారీ సినిమాలో ఆమెకి అవకాశం రావడం .. ఆ పాత్ర ఆమెకి ఎంతో గుర్తింపును తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో నయనతార పాత్రకంటే తమన్నా పాత్ర ఎక్కువ ప్రభావం చూపడం, ప్రమోషన్స్‌లో నయనతార ఎక్కడా కనిపించకపోగా, తమన్నా చురుకుగా పాల్గొనడం జరిగింది. 
 
దాంతో మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి తమన్నా మంచి మార్కులు కొట్టేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రశంసలతో పాటు.. చిత్ర హీరో చిరంజీవి ప్రత్యేకంగా తమన్నా గురించే పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ కారణంగానే తమన్నాకి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నట్టుగా సమాచారం. మొత్తంమీద "సైరా" చిత్రం తమన్నా ఫేట్ మార్చిందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments