'ఐ లవ్ యూ బేబీ' అంటూ వెనుకనుంచి ముద్దుపెట్టబోయాడు.. స్వరా భాస్కర్

క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెదవి విప్పారు. తనకు కూడా ఓ నిర్మాత నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్టు చెప్పుకొచ్చింది. ఓ సందర్భంగా ఓ నిర్మాత ఐ లవ్ యూ బేబీ అంటూ వెనుక వైపు నుంచి ముద్దు ప

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (13:27 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెదవి విప్పారు. తనకు కూడా ఓ నిర్మాత నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్టు చెప్పుకొచ్చింది. ఓ సందర్భంగా ఓ నిర్మాత ఐ లవ్ యూ బేబీ అంటూ వెనుక వైపు నుంచి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడనీ వెల్లడించింది.
 
'వీరే ది వెడ్డింగ్' చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్‌లతో కలిసి స్వరా భాస్కర్ నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో ఆడుతోంది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. 
 
అలాగే, తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ప్రస్థానం చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, స్వరా భాస్కర్ కీలక పాత్రను పోషించనుంది. 
 
ఈ నేపథ్యంలో తన జీవితంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటన గురించి మాట్లాడుతూ, ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించింది. ఓ నిర్మాత నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. తన వెనుక నిల్చుని 'ఐ లవ్ యూ బేబీ' అంటూ తనను తాకబోయాడని, తన చెవికి ముద్దు పెట్టడానికి యత్నించాడని తెలిపింది. ఇదంతా క్యాస్టింగ్ కౌచ్‌లో భాగమేనని వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం